వరుకోలు లక్ష్మయ్య group storage
[05/11/2018, 8:15 am] Laxmaiah: నక్షత్రయుక్తo చమత్కారం చూ( చదవండి )డండి :-
నక్షత్రము గల చిన్నది
నక్షత్రము చేతబట్టి నక్షత్రప్రభున్
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రము పైనవేసి నాథుని పిలిచెన్
ఇందులో నాలుగు నక్షత్రాలు దాగి ఉన్నాయి. పదే పదే చదివితేనే కానీ అంతసులువుగా అర్థమయేవికావు. ఇటువంటి ప్రహేళికలను'ప్రముషితా' ప్రహేళికలని అంటారని కవి దండి తన'కావ్యాదర్శం' లో చెప్పాడు.
ఇప్పుడు వివరణ చూద్దాం!
మహాభారతంలో విరాటపర్వం చదువనివారుండరు. విరాటరాజు కుమార్తె "ఉత్తర" (నక్షత్రం పేరు ) ఆమె అభిమన్యుని భార్య. నక్షత్రము చేతబట్టి అంటే కుంకుమ పాత్ర "భరణిని" ( నక్షత్రం పేరు ) చేతిలో పట్టుకొని ; నక్షత్రప్రభున్ నక్షత్రాలకు ప్రభువైన చంద్రుని వంశపు ( చంద్రవంశము ) అభిమన్యుని; నక్షత్రమునకు రమ్మని అంటే ఒక "మూల" ( నక్షత్రం పేరు ) కు రమ్మని పిలిచి; నక్షత్రము పైనవేసి అంటే "హస్త" (నక్షత్రం పేరు ) మును అతని మీదవేసి; నాథుని పిలిచెన్ అంటే పతియైన అభిమన్యుని ప్రేమగా పిలిచిందట.
అమ్మో! ఈ పద్యం అర్థంకాకుంటే మీకు నిజంగానే నక్షత్రాలు కనిపించేవి కదూ! అదీ మరి కవి చమత్కారమంటే!
[10/11/2018, 6:06 pm] Laxmaiah: నాచిత్రం మీపద్యం162
మొలక భానుడు జగముకు వెలుగునివ్వ
నిత్య ముదయించు చుండెను సత్యముగను
సంధ్య వేళన యర్ఘ్యంబు చక్కగాను
అర్పణను చేయుచుందుము అర్కజునకు
వరుకోలు లక్ష్మయ్య
[10/11/2018, 11:06 pm] Laxmaiah: *1.పేరు:వరుకోలు లక్ష్మయ్య*
*2. కలం పేరు:స్వర్ణ శ్రీ*
*3. చిరునామా:12-1-156*
*మోహిన్ పురా. సిద్ధిపేట*
*502103*
*4. చదువు:MA,B.Ed*
*5. వృత్తి:స్కూల్ అసిస్టెంట్* *(తెలుగు)*
*ZPHSగుఱ్ఱాలగొంది*
*6. ప్రవృత్తి:రచనా వ్యాసంగం*
*7. ఎంతకాలం నుండి రచనలు చేస్తున్నారు:*
*2010నుండి*
*8. ముద్రితములు:*
*1.మబ్బుల పల్లకి*
*(బాల గేయాలు-2011)*
*2.లక్ష్మణ శతకం-2014*
*3.మనవూరు*
*(పద్యకావ్యం-2017)*
*4.నీతి పుష్పాలు*
*(బాల గేయాలు-2018)*
*9. అముద్రితములు:*
*1.కనకడప్పు వచన కవిత*
*2.జ్ఞానకిరణాలు పద్యకావ్యం*
*3.బావలహరి పద్యసంపుటి*
*10.అవార్డులు:*
*1.1997స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలలో జిల్లా బంగారు పతకం*
*2.2011 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు*
*3.2015 మండల స్థాయి ఉత్తమ కవి*
*4.2010.లో సిద్ధిపేట మండల బెస్ట్ స్కూల్ అవార్డు.*
*11. పురస్కారాలు*
*1.2017 కృషి కవిత పురస్కారం*
*2.2017 బతుకమ్మ పురస్కారం*
*3.2017 గురజాడ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి*
*విశిష్ట పురస్కారం*
*4.2015మౌలానా అబుల్ కలాం ఆజాద్ పురస్కారం*
*5.2014.మదర్ థెరిస్సా పురస్కారం*
*6.తెలుగు కవితా వైభవం వారిచే సహస్ర వాణి పద్యశ్రీ బిరుదు*
*7.2017.ప్రపంచ తెలుగు మహాసభలు పృచ్ఛకునిగా పురస్కారం*
*8.2007 పీర్లపల్లి గ్రామస్తులచే పౌరసన్మానం*
*9.2106 కాళోజి జయంతి సందర్భంగా* *Dr.సి.నారాయణరెడ్డిగారిచే పురస్కారం*
*10.2001లో జనాభా గణన లో ఉత్తమ ఎన్యుమరేటర్ పురస్కారం.*
*12. నేటికవిత సమూహం పై మీ అభిప్రాయం*
*నూతన కవులకు మంచి* *సదవకాశం.రాసిన ప్రతి* *కవితలను సమీక్ష చేయించి మంచి చెడులను సవివరంగ* *చెప్పగలిగే ఏకైక వాట్సాప్ గ్రూప్ నేటి కవిత.ప్రతికవికి సన్మానం* *చేయడం గ్రూప్ అడ్మిన్ గారి ఓపికకు నిదర్శనం.*
*13.ఈసమూహంలో మీరుకోరుకుంటున్న మార్పులు:*
*నేటి కవితలో కవులకు మీరిచ్చె బిరుదులు కొండంత బలాన్ని యిస్తాయి.*
*పద్యపరిమళంలో గూడ మంచిమాట,నాచిత్రం మీపద్యం,*
*దత్తపది,* *సమస్యాపూరణం.అనేఅంశాలతో నిర్విఘ్నంగా* *కొనసాగుతోంది.సమస్యలకు* *సలహాలు ,సూచనలు గ్రూప్ లోనె చెప్పిస్తె బాగుంటుంది అందరికి* *సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది*
ఇంట్రో:
అతడి పాట సప్తస్వరాల సయ్యాట. కోవెలలో జేగంట.ఆ సంగీత విద్వన్మణి తెలుగు సినీగానానికి మంగళధ్వని. మధుర స్వరధుని. సప్తస్వరజ్ఞాని. గొప్ప విషయ పరిజ్ఞాని. దశాబ్దాల తెలుగు చలనచిత్రరంగ నేపథ్య గాన ఊసులను గుండె ఘోషగా పలికించే విజ్ఞాన సర్వస్వం. ఆ సుమధుర గళం ఇలవేల్పుల దివ్యస్తోత్రం. వెండి తెరవేల్పులకు ప్రాణం. వెరసిఎస్.పీ బాల సుబ్రహ్మణ్మం. గానమే యోగంగా భాసిల్లే ధ్యాన సుబ్రహ్మణ్యం. విధాత తలపున ఏమి ప్రభవించిందో..ఏం ప్రవహించిందో..దశాబ్దాల పాటు ప్రేక్షకులకు అతడి పాటే మంత్రమైంది. వివిధ్య గళ మాధుర్యంతో అందరికీ గాత్రదానం చేసే బహుపాత్రధారి బాలసుబ్రహ్మణ్యం.
యాంకర్-1
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. పండితులకూ, పామరులకూ ఆరాధ్యుడే. అర్ధశతాబ్ది కాలంలో వేలాది గీతాలు అతడి గాత్రం నుంచి రవళించాయి. సినీ నేపథ్య గానాన్ని సుసంపన్నం చేశాయిదశభాషా గాయకుడుగా దశదిశలా భారతీయ సినీ గాన యశస్సును చాటిన ప్రతిభాశాలి. ఒకప్పుడు తెలుగు సినిమాకు నాలుగు స్తంభాలు ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ. వీరందరికి గానం చేశారు. ఎన్టీఆర్, ఏ ఎయన్నార్ వారసులకు కూడా బాలు తన గళమిచ్చారు.
వాయిస్-1
అలనాటి గాన గంధర్వుడు ఘంటసాల దివికేగినప్పుడు అప్పటిఅగ్రకథానాయకులకు గొంతు పెగలలేదు. చాలాకాలం తమ పాటలకు మరో గాయకుణ్ణి కలనైనా ఊహించలేకపోయారు. నిండైన తమ రూపాలకు తగినట్లు మైండైన గళంతో పాటలు పాడే వారికోసం చిత్రసీమ అన్వేషిస్తున్న సమయం.
చెన్నయ్ లో ఇంజనీరింగ్ లో బీటెక్ స్థాయితో సమమైన ఏఐఎంఈ చేస్తున్న వేళ.ఇంజనీరింగ్ చదువుతున్నప్పటికీ ..ఇన్నర్ ఇంజనీరంగ్ అంతా సంగీతమే. అంతరంగమంతా సంగీతమే. మనసంతా శృతిలయల పల్లకీలో విహరించేది. వైపు చదువుతూనే మరో వైపు ఇళయరాజా, అతడి సోదరుడు గంగై అమరన్, మరికొందరు మిత్రులతో కలసి ఒక సంగీత బృందంగా ఏర్పడి...తమిళనాట గ్రామగ్రామానా మ్యూజికల్ నైట్స్ లో పాల్గొన్నారు. అతడి గాత్రం నాదవినోదం.సప్తస్వరాల ప్రమోదం. సరిగమలు వర్షించే మేఘమల్హరం. 1964లో ఒక సంగీత సాంస్కృతిక సంస్థ నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి వరించింది. ఆనాడు ఒక పాటల పోటీకి న్యాయనిర్ణేతలుగా వచ్చిన సంగీత దిగ్గజాలుసుసర్ల దక్షిణామూర్తి, ఎస్పీ కోదండపాణి, గంధర్వగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. వీరు ముగ్గురూఅతడి గాత్రమాధుర్యాన్ని, సొగసైన స్వరాల విరుపులను, మెరుపులను...గుర్తించారు. సంగీతదర్శకుడుగా లబ్దప్రతిష్ఠుడైన ఎస్పీ కోదండపాణి గుర్తించి తొలి అవకాశం ఇచ్చారు. ఆ క్రమంలో 1966 శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ కోసం ‘ఏమి ఈ వింత మోహం’ అనే పాటను ధ్వనిముద్రితం చేశారు. ఆ చిత్రం మరుసటి ఏడాది విడుదలైంది. 1968లో కోదండపాణి సుఖదు:ఖాలు చిత్రంలో ‘మేడంటే మేడా కాదు’ పాటతో మరో అవకాశమిచ్చారు. ఆ లేత స్వర మాధుర్యానికి తెలుగు సినీ ప్రేక్షకలోకం తీయగా ఉలిక్కిపడింది. 1968లో మంచిమిత్రులు సినిమాలో అనుకోని అవకాశం. అగ్రశ్రేణి గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుతో కలసి మంచి మిత్రులు సినిమా కోసం ఎన్నాళ్లో వేచిన ఉదయం..ఈనాడే నిజమౌతుంటే’ గీతాన్ని పాడారు.
చిత్రంగా పాటలో మాటలు బాలు అంతరంగానికీ అద్దం పట్టాయి. అదే ఏడాది ప్రేక్షకులను అలరించిన ఉండమ్మా బొట్టుపెడతా చిత్రంలో సంక్రాంతి పౌష్యలక్ష్మిని స్వాగతించే గీతం ‘రావమ్మా మహాలక్ష్మి రావమ్మా’ బాలుకు ఎంతో పేరు తెచ్చింది. దశాబ్దాలపాటు ఆ పాట సంక్రాంతి పాటలకు మకుటాయమానంగా నిలిచింది.
1969లో విక్టరీ మధుసూదనరావు దర్శకత్వంలో వచ్చిన ఆత్మీయులు సినిమాలో సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు ఎస్పీబాలుకు అవకాశమిచ్చారు. చంద్రమోహన్,చంద్రకళ మీద చిత్రించిన ‘చిలిపినవ్వుల నిను చూడగానే వలపు పొంగేను నాలోనే.. యుగళం. ఈ గీతంలో బాలు స్వరవైవిధ్యాన్ని చూపారు.
తర్వాత 1969లో మహదేవన్ స్వరకల్పనలో ఏకవీర సినిమాలో ఘంటసాలతో కలసి ‘ప్రతీ రాత్రి వసంతరాత్రిఈ పాటను పాడే అవకాశం దక్కింది. మరుసటి ఏడాది సంచలనాత్మక చిత్రం మనుషులు మారాలిలో ఛాన్స్ వచ్చింది. అందులో హరనాథ్ కు పాడిన ‘తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో’ ..పాట ఎనలేని ఖ్యాతిని తీసుకొచ్చింది. 1969లోనే విడుదలైన అమ్మకోసం సినిమాలో సంగీతదర్శకుడు ఆదినారాయణరావు బాలుకి ఒక పాట ఇచ్చారు. గువ్వలా ఎగిరి పోవాలి అనే ఆ పాటతో బాలు తెలుగు సినీ నేపధ్యప్రపంచంలోకి తన స్వర విహంగాన్ని బలంగా ఎగురవేశాడు.1970లో ‘కథానాయిక మొల్ల’లో తాత్వికతను ప్రతిబింబించిన మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయ్య’ పాటతో బాలు తన ఉనికిని చాటుకున్నారు. 1970లో ఒక అద్భుత అవకాశం లభించింది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చెల్లెలికాపురం సినిమాలో సంగీత దర్శకుడు మహదేవన్ ‘ఆడవే మయూరీ.నటనమాడవే మయూరీ’ అనే పాట ఇవ్వటంతో బాలు చెలరేగిపాడారు. 1971లో చలం, జమున నటించి ‘మట్టిలో మాణిక్యంలో సత్యం స్వరకల్పనలో రిమ్‌జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్’, 1972లో ‘ఇద్దరు అమ్మాయిలు’లో నా హృదయపు కోవెలలో గీతాలు గుర్తింపు తెచ్చాయి. అయితే మరుసటి ఏడాది వచ్చిన బడిపంతులు సినిమా ఎస్పీ బాలు గాత్ర వైవిధ్యానికి దర్పణం పట్టింది. హాస్యనటుడు రాజబాబు, రమాప్రభలపై చిత్రించిన ఓరోరి పిల్లగాడా..పాటను ప్రేక్షకులు ఆదరించారు. 1972లో పలకరించిన గూడుపుఠాణి సినిమా బాణీలు కోదండపాణి స్వరమధురిమలను పంచాయి. ఆ చిత్రంలో ఏకంగా 8 పాటలకు ఆయన బాలుకు అవకాశమిచ్చారు.వీటిలో ‘తనివి తీరలేదే..’ అనే పాటనుకథానాయకుడు కృష్ణ, కథానాయకి శుభలపై చిత్రీకరించారు. ఎన్ని వసంత వేళలు వెళ్లిపోయినా ఆ గీతం తరతరాలుగా సంగీతప్రియులను అలరిస్తోంది. 1972లో మానవుడు దానవుడు లో శోభన్ బాబు కోసం ‘అణువు అణువు వెలసిన దేవా’, అదే ఏడాది అక్కినేని నటించిన దత్తపుత్రుడులో రెండో కథానాయకుడు రామకృష్ణ కోసం అందానికి అందానివై’ పాటలు పాడారు. అదే ఏడాది బాలమిత్రుల కథలో మరో వైవిధ్య గాత్ర ప్రతిభకు అవకాశమున్న ‘రంజుభలే రామచిలుక’ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి గుర్తింపు తెచ్చింది. 1973లో కన్నెవయసు చిత్రంలో దాశరథి గీతం ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ అఖండ విజయం సాధించింది. 1975 పూజలో రాజన్ నాగేంద్ర బాణీలలో దాశరథి రాసిన ప్రేమైక గీతం ‘ఎన్నెన్నో జన్మల బంధం’ గీతం నాడు యువహృదయాలను గిలిగింతలు పెట్టింది. ఒక్కో పాటతో తనదైన ముద్రవేసి క్రమంగా బాలసుబ్రహ్మణ్యం అవకాశాలతో దూసుకెళుతున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా అగ్ర కథనాయకులు ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావుచిత్రాలలో పాడేందుకు అవకాశాలు రావటం లేదు. అడపాదడపా ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు అవకాశాలు ఇస్తున్నా ఏఎన్నార్ సినిమాల్లో అవకాశాలు అస్సలు రావటం లేదు. అదో వెలితిగా తోచింది.
Graphics-1
దివికేగిన ఘంటసాల
మరోగాయకుడి కోసం అన్వేషణ
మద్రాసులో చదువుతున్న బాలు
మనసంతా శృతిలయల పల్లకీ
సంగీత బృందం ఏర్పాటు
తమిళనాట పల్లెల్లో పర్యటనలు
1964లో ఒక పాటల పోటీ
విజేత బాలు
1966 శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న (ఏమీ ఈ వింత మోహం)
1968 సుఖ దు:ఖాలు (మేడంటే మేడా కాదు)
1971 మట్టిలో మాణిక్యం (రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ హైదరాబాద్)
1973 పాపం పసివాడు (మంచి అనేదే కానరాదు ఈ మనుషుల లోన..)
1973 కన్నె వయసు .. ( ఏ దివిలో విరిసిన పారిజాతమో.)
1973 భక్తతుకారాం.. (కలియుగం కలియుగం)
1973 మీనా.. (పెళ్లంటే నూరేళ్ల పంట)
1973 దేశోద్ధారకులు (ఆకలై అన్నమడిగితే)
1974 దేవుడు చేసిన మనుషులు (దోర వయసు చిన్నది)
1974 పుట్టినిల్లు-మెట్టినిల్లు (ఇదే పాట..ప్రతిచోట)
పెద్ద హీరోల చిత్రాలలో రాని అవకాశాలు
యాంకర్-2
ఒక సంగీత దర్శకుడు చేసిన మంత్రోపదేశమే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నేపథ్యగానంలో సాటిలేని మేటిగా నిలబెట్టింది. ఆయన మాటలను శోరోధార్యాలుగా శిరసావహించిన బాలసుబ్రహ్మణ్యం సినీసంగీతంలో శిఖర సమానుడుగా ఎదిగారు. అవకాశాలకోసం తాను నిరీక్షించే పరిస్థితి నుంచి బయటపడి సంగీత దర్శక, నిర్మాతలను, కథానాయకులను తన పాటకోసం నిరీక్షించే పరిస్థితిని సృష్టించుకున్నారు.
వాయిస్-2
అవకాశాలు నీవే సృష్టించుకోవాలి. నాగేశ్వరరావుకి పాడితే నాగేశ్వరరావులా, రామారావుకి పాడితే రామారావులా ఆవహించి పాడాలి. అప్పుడే నీవు నిలదొక్కుకుంటావు అని సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు చేసిన మంత్రోపదేశం బాలసుబ్రహణ్మం భవిష్యత్తును దివ్యంగా తీర్చిదిద్దింది. ఆయన మాటలనే వేదవాక్కులుగా భావించి శిరోధార్యంగా స్వీకరించారు. ఆలుమగలు సినిమాలో ఎరక్కపోయి వచ్చాను..ఇరుక్కుపోయాను పాట నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నటులను ఆవహించి పాడటం నేర్చాడు. నటీనటుల గాత్రధర్మాన్ని అనుసరించి పాడటం ప్రారంభించడంతో బాలసుబ్రహ్మణ్యం స్వరవిన్యాసాలకు ప్రేక్షకలోకం మంత్రముగ్ధ మైంది. బాలసుబ్రహణ్యం గానయాత్ర మంద్రం నుంచి మధ్యమానికి, తర్వాత తారస్థాయికి చేరింది. అంతే ఇక వెనుదిరిగిచూసుకొలేదు.చెన్నయ్ లో చదువుతూనే తరచూ కోదండపాణిని కలుతూ సంగీతంలోని మెళకువలను ఔపాసన పట్టారు. సంగీతం శాస్త్రీయంగా నేర్చుకోలేదు. అయినా బాలుకు రాగ, తాళ జ్ఞానపం, సంగీత పరిజ్ఞానం పుష్కలం. ఒక్కసారి వింటే అదేవిధంగా పాడగలిగే ఏకసంధాగ్రాహి. గళానికీ అభినయం ఉంటుందని, ఉందని, నిరూపించిన సంగీత జ్ఞాని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. సంగీత దర్శకులు స్వర జ్ఞానులైతే బాలసుబ్రహ్మణ్యం గళ విన్యాస జ్ఞాని. ధ్వన్యనుకరణ అని కొందరంటారు. అనుకరణ కాదు. అది ధన్యనుసరణ.
నటరత్న ఎన్టీఆర్ కథానాయకుడుగా 1974లో ప్రేక్షకులముందుకు వచ్చిన‘దీక్ష’ ఆ చిత్రంలో ప్రకృతినీ, ప్రేమనూ అనుసంధానించిన సినారె గీతం ‘మెరిసే మేఘమాలిక, ఉరుములు చాలు చాలిక’ అంటూ బాల సుబ్రహ్మణ్యం చేసిన హృద్య గానం ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది. దశాబ్దాలుగా నిలిచిపోయింది.1975 అన్నదమ్ముల అనుబంధంలో గులాబి పువ్వై నవ్వాలి వయసు’ అనే ప్రేమగీతం అలరించింది. మురళీమోహన్‌ని ఆవహించినట్లు పాడారు.
1976లో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ఎన్టీరామారావు కథానాయకుడుగా అలరించిన తొలి సినిమా మనుషులంతా ఒక్కటే. ఇందులో సాలూరు రాజేశ్వరరావు స్వరాలు అద్దిన ‘అనుభవించు రాజా’ పాట ప్రేక్షకులను మెప్పించింది.
అదే ఏడాది వచ్చిన ‘నేరంనాదికాదు ఆకలిది’ సినిమాలో ‘మంచిని సమాధిచేస్తారా ?’ గీతం మానవత్వం లేని మనుషులపై ఆవేదనతో సినారే నిరసనగా రాసిన పాట బాలు గళం నుంచి జాలువారి కదిలించింది. బాలు తాను ఎవరికైతే గానం చేస్తారో వారిని ఆవహిస్తున్నారా? ఆ పాట అచ్చంగా నటీనటులే పాడుతున్నట్లు తన స్వర పుష్పాలతో ఆవాహన చేస్తున్నారా? పరకాయ ప్రవేశ చేస్తారా? అచ్చం అలాగే పాటడం ఎలాసాధ్యమని ఆశ్చర్యపోతుంటారు.
నాడు బడిపంతులు సినిమాలో రాజబాబుకి ఓరోరి పిల్లగాడా పాటతో స్వరవిన్యాసం చేసిన బాలు..ఎన్టీరామారావు సినిమా మనుషులంతా ఒక్కటే చిత్రంలో ‘ముత్యాలు వస్తావా అనే పాటను అచ్చం అల్లురామలింగయ్యే పాడుతున్నట్లు అనుసరించారు. పాత్రల గళాలను అర్ధం చేసుకొని ఆవహించటమే కాకుండా, వారి శారీరక భాషనూ అనుసరించి తగిన రీతిలో గానం చేయడం బాలు ప్రత్యేకత. ఘంటసాల తరువవాత ఎన్టీరామారావుకు, అక్కినేనికి అచ్చం అలాగే పాడి మురిపించటం సాధ్యమా? అంతటి సాహసం చేసేది ఎవరు? 1977లో ఎన్టీరామారావు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం అడవిరాముడు. ఆ సినిమా నుంచి ఎన్టీఆర్ కి తగినట్లుగా బాలసుబ్రహ్మణ్యం తన గొంతు మార్చుకున్నారు. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అనే పాట అఖండ విజయం సాధించింది. వేటూరి కలం, బాలూ గళం, మహదేవన్ స్వరం ప్రేక్షకులపై ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’పాటవిజయవంతమయ్యాయి. ప్రేక్షకులు ఎన్టీఆర్-బాలు కలయికను స్వాగతించారు. 1977లోనే ప్రేక్షకులను అలరించిన దానవీర శూరకర్ణలో దుర్యోధనుడికి ఎన్టీఆర్ యుగళగీతం పెట్టారు. సినారె రాసిన ఆ పాట చిత్రంగా,భళారేవిచిత్రంగా, గమ్మత్తుగా అన్పించింది. అదేఏడాది ఎన్టీఆర్, ఏయన్నార్ నటించిన చాణక్యచంద్రగుప్తలో పెండ్యాల నాగేశ్వరరావు స్వరాల్లో అలరించిన గీతం ‘చిరునవ్వుల తొలకరిలో’. ఇళయరాజా స్వరాలు కూర్చిన యుగంధర్ లో నాపేరే యుగంధర్, కేడీ నెంబర్-1 లో ఎస్ నేనే నెంబర్ వన్ గీతాలు అలరించాయి. 1979లో వేటగాడు లో ఆకుచాటు పిందె తడిచె పాట, కొండ మీద చందమామా గీతాలు ప్రేక్షకులకు నచ్చాయి. బాలు ఎన్టీఆర్ ను పూర్తిగా ఆవహించి పాడుతున్నారు. 1981లో గజదొంగలో ఇంద్రధనస్సు చీరకట్టి పాట. 1982లో కొండవీటి సింహంలో ఈ మధుమాసంలో గీతం అలరించాయి.బొబ్బిలిపులిలో బాలు గానం చేసిన జననీ జన్మభూమిశ్చ: గీతం అణువణువునా దేశభక్తి నింపింది. 1993లో మళ్లీ అటువంటి గీతమే పుణ్యభూమి నాదేశం నమో:నమామీ)
Graphics-2
1974 దీక్ష (మెరిసే ఓ మేఘమాలిక..)
1975 అన్నదమ్ముల అనుబంధం (గులాబి పువ్వై నవ్వాలి)
1976 మనుషులంతా ఒక్కటే (అనుభవించురాజా, ముత్యాలు వస్తావా)
1976 నేరం నాది కాదు ఆకలిది (మంచిని సమాధి చేస్తారా)
1977 అడవి రాముడు (ఆరేసుకోబోయి ..కృషి వుంటే మనుషులు..orకుకు..కుకు)
1977 యమగోల ( ఓలమ్మి తిక్కరేగిందా...)
1977 చాణక్య చంద్రగుప్త (చిరునవ్వుల తొలకరిలో)
1978 యుగంధర్ (నా పేరే యుగంధర్)
1978 కేడీ నెంబర్ 1 (ఎస్.నేనే నెంబర్ 1)
1979 వేటగాడు ( ఆకుచాటు పిందె తడిచె, కొండమీది చందమామా)
1980 సర్దార్ పాపారాయుడు (హల్లో టెంపర్)
1981 గజదొంగ (‘ఇంద్రధనస్సు చీరకట్టి)
1981 కొండవీటి సింహం
1981 జస్టిస్ చౌదరి (
1982 బొబ్బిలి పులి (జననీ జన్మభూమిశ్చ)
1993 మేజర్ చంద్రకాంత్ (పుణ్యభూమి నాదేశం)
యాంకర్ -3
గంధర్వ గాయకుడు ఘంటసాల దివికేగిన తరువాత కొంతకాలం నాటి అగ్ర కథానాయకుడు ఏయన్నార్ ఎక్కువ పాటలు విస్సంరాజు రామకృష్ణతో పాడించుకున్నారు. చివరికి బాలు గొంతునే ఎంచుకున్నారు. ఆలుమగలు చిత్రం నుంచి గానవైవిధ్యం ప్రదర్శిస్తూ అక్కినేనికి విలక్షణంగా పాడసాగారు బాలసుబ్రహ్మణ్యం.
వాయిస్ -3
(స్పాట్ బాలు గానం, హీరోల పాటలు, సంగీతదర్శకులు)
మహదేవన్ అడవిరాముడిలా తెలుగు సినిమాను కమ్ముకున్న సమయం. చక్రవర్తి చెలరేగి యమగోల ప్రారంభించారు.సత్యం శివమెత్తాడు. సాలూరు రాజేశ్వరరావు రసాలూరిస్తున్నారు. మరో పక్క రాజ్-కోటీ ద్వయం సంచలనాలు.తమిళం నుంచి ఎంఎస్ విశ్వనాథన్, కన్నడ దేశం నుంచి రాజన్-నాగేంద్రల మధుర బాణీలు మనసుతాకుతున్నాయి. సంగీతదర్శకులు ఎందరున్నా.అందరి వాడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అందరికీ కావలసింది బాలుడే..ఈ గానలోలుడే. తమిళదేశం నుంచి ఇళయరాజా దూసుకొస్తున్నాడు. ఇళయరాజా బాలూ రాగబంధం అనేక అద్భుతాలు సృష్టించింది. ఘంటసాల తరువాత బాలసుబ్రహ్మణ్యం అక్కినేని నాగేశ్వరరావుకు తన తొలిపాటను 1970లో గానం చేశారు. సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ ఇద్దరు అమ్మాయిలు అనే చిత్రంతో ఈ అవకాశం కల్పించారు. అయితే చాలాకాలం వరకు అక్కినేని బాలుతో పాటలు పాడించుకోలేదు. కానీ తాతినేని చలపతిరావు బాలు వాయిస్ తో ఆలుమగలు సినిమాలో చేసిన ప్రయోగం నాగేశ్వరరావుకు నచ్చింది. దాంతో అప్పటి నుంచి వారికి రాగబంధం ఏర్పడింది. ఆలుమొగలులోని ఎరక్కపోయి వచ్చాను..ఇరుక్కుపోయాను అచ్చం నాగేశ్వరరావు గానం చేసిన అనుభూతి కలిగించారు. అక్కినేని నాగేశ్వరరావుకు బాలు పాడిన పాటల్లో వందలసంఖ్యలో ఎంచదగిన పాటలున్నా..వాటిలో కొన్నింటిని ప్రస్తావించాల్సి ఉంది. 1979లో ఎఎన్నార్-శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ముద్దుల కొడుకులో చిటపట చినకుల మేళం పాట ఒకటి. 1980లో రావణుడే రాముడైతేలో రవివర్మకే అందని అందానివో, 1980లోనే విడుదలైన ఏడంతస్తుల మేడ సినిమాలో ఇది మేఘ సందేశమూ ఎంచదగినవి. ఇక అటు దాసరి నారాయణ రావుకి, ఇటు అక్కినేనికి ప్రతిష్ఠాత్మకమైన ప్రేమాభిషేకంలో అన్ని పాటలూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి.
ఆగదూ-ఆగదూ, వందనం,అభివందనం’ కోటప్పకొండకు వస్తానని..గీతాలలో బాలసుబ్రహ్మణ్యం అక్కినేనికి తన గానవిలక్షణత ను గమనించవచ్చు. 1991లో సీతారామయ్యగారి మనవరాలులో బాలు ఏఎన్నార్ కు పాడారు.
Graphics-3
1983లో శ్రీరంగనీతులు (తొంగి తొంగి చూడమాకు చందమామ)
1979 ముద్దుల కొడుకు (చిటపట చినుకుల మేళం)
1980 రావణుడే రాముడైతేలో రవివర్మకే అందని అందానివో..
1980 ఏడంతస్తుల మేడ లో ఇది మేఘసందేశమో
1981 ప్రేమాభిషేకం .ఆగదూ..ఆగదూ. ..వందనం అభివందనం,
కోటప్ప కొండకు వస్తానని, వందనం ..అభివందనం
1983 శ్రీరంగ నీతులు (తొంగి తొంగి చూడమాకు చందమామ)
1990 సీతారామయ్యగారి మనవరాలు (సమయానికి తగు)
వాయిస్¬- 4
ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు. సాహసానికి మారుపేరు కృష్ణ. వీరిద్దరి సినిమాల్లో లభించిన ప్రోత్సాహంతో బాలు చిత్రసీమలో నిలదొక్కుకున్నారని చెప్పాలి. ఇంతకు ముందే ప్రస్తావించినట్లు 1971లో చెల్లెలికాపురంలో ఆడవే మయూరి గీతం తో తెలుగు సినీ నేపథ్య ప్రపంచంలో బాలు తన ఉనికిని బలంగా చాటుకున్నారు. మధుర స్వర మాంత్రికుడు కేవీ మహదేవన్ మనుషులు మారాలిలో హరనాథ్ కోసం తూరుపు సిందూరపు మందారపు వెన్నెలలో, అలాగే శోభన్ బాబు-శారదలపై చిత్రీకరణకు ‘పాపాయి నవ్వాలి, పండగే రావాలి’ గీతాలను పాడించటంతో బాలుకు మంచి గుర్తింపు లభించింది. 1972లో మానవుడు-దానవుడులో శోభన్ బాబు పై చిత్రీకరించిన అణువు అణువు ఓ దేవ, 1973లో పుట్టినిల్లు- మెట్టినిల్లులో ఇదే పాట..ప్రతినోట గీతాలు బాలు లేతస్వరం నుంచి వెలువడి ఆకట్టుకున్నాయి.
1974లో శోభన్, మంజుల నటించిన జగపతి పిక్చర్స్ మంచి మనుషులలో బాలుకు మహదేవన్ అన్నిపాటలు పాడే అవకాశమిచ్చారు. నీవులేక నేను లేను గీతం ఎక్కువ గుర్తింపు తెచ్చింది. అన్ని పాటలూ ఆదరణ పొందాయి. 1975లో కే విశ్వనాథ్ జీవనజ్యోతి సినిమాలో బాలు శోభన్ కోసం చిన్ని ఓచిన్నీ పాట ఆకట్టుకుంది. 1979లో శోభన్ బాబు, మహానటి సావిత్రి , సుజాత నటించిన గొరింటాకులో ఇలాగ వచ్చి, కొమ్మకొమ్మకో సన్నాయి గీతాలు, 1981లో శోభన్, శ్రీదేవి నటించిన దేవతలో వెల్లువొచ్చి గోదారమ్మ పాట బాలుకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలను సమకూర్చాయి.
Graphics-4
1971ఆడవే మయూరీ (చెల్లెలి కాపురం)
1971 మనుషులు మారాలి (తూరుపు సిందూరపు), పాపాయి నవ్వాలి..పండగే రావాలి
1972 అణువు అణువు ఓ దేవ (మానవుడు –దానవుడు)
1973 ఇదే పాట ప్రతి నోట (పుట్టినిల్లు-మెట్టినిల్లు)
1974నీవులేక నేను లేను (మంచి మనుషులు)
1975 చిన్ని ఓ చిన్నీ (జీవనజ్యోతి)
1979 గోరింటాకు (ఇలాగ వచ్చి, కొమ్మకొమ్మకో సన్నాయి)
1981 దేవత ( వెల్లువొచ్చి గోదారమ్మ)
యాంకర్ -5
తెలుగు సినిమా తొలితరం నాలుగు మూల స్తంభాలలో లివింగ్ లెజెండ్ హీరో కృష్ణ. తొలి కౌబాయ్ చిత్రం తెచ్చినా, తొలి సినిమా స్కోప్ తెచ్చినా ఆ ఖ్యాతి ఆయనకే దక్కింది. ఆయనకు బాలసుబ్రహణ్యం గళం సరిగ్గా సరిపోతుందని ప్రేక్షకల విశ్వాసం. కృష్ణతో బాలుది అనేక దశాబ్దాల రాగబంధం.
వాయిస్-5
తెలుగు సినిమా చరిత్రలో సాహసంతో సినిమాలు తీస్తారని పేరున్న కృష్ణ అత్యంత విశ్వాసంతో సినీ రంగంలో దూసుకెళ్లారు. ఆయనకు బాలసుబ్రహ్మణ్యం స్వర విన్యాసాలు సరిగ్గా సరిపోయాయి. 1973లో వచ్చిన మాయదారి మల్లిగాడులో ఆయన కృష్ణ నవ్వుని బాగా ఔపాసన పట్టినట్లు నవ్వారు. నిజానికి తాతినేని చలపతిరావు సూచనలు చేయకముందే బాలసుబ్రహ్మణ్యం నటీనటుల గాత్రధర్మాలను అనుసరించే గానం చేసేవారు. 1975లో విడుదలైన కొత్తకాపురంలో టైటిల్ సాంగ్ ప్రేక్షకుల హృదయాలను స్పృసించింది. 1975లో చీకటి వెలుగులు చిత్రంలో చీకటి వెలుగుల కౌగిలిలోపాట, 1976లో రాజేశ్వరీ విలాస్యకాఫీక్లబ్ లో ‘నాపేరు బికారి.నా దారి ఎడారి గీతాలు బాలుకి ఎంతో పేరు తెచ్చాయి. 1978లో ఇంద్రధనస్సులో నేనొక ప్రేమ పిపాసి పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. అదే ఏడాది కృష్ణ, రజనీకాంత్‌ల చిత్రం అన్నదమ్ముల సవాల్ లో నాకోసమే నీవున్నది, 1978లో వచ్చినయహేజెంట్ గోపీలో ఓ హంసభలే రామచిలుకా, 1979లో ముత్తయిదువ సినిమా కోసం బాలు గానం చేసిన సుధా రాగ సుధా గీతాలు బాళు గళవైవిధ్యాన్ని, ప్రత్యేకతను చాటాయి. 1981లో చుట్టాలున్నారు జాగ్రత్తలో బాలు అపనా తనామనా పాట ఒక హుషారుగీతం. 1994లో కృష్ణ ను కొత్తగా చూపించిన ఎస్వీకృష్ణారెడ్డి చిత్రం నెంబర్-1.ఇందులో ఛాంగుభళా పాట ఆదరణపొందింది.
Graphics-5
1973 మాయదారి మల్లిగాడు (నవ్వుతూ బతకాలిరా)
1975 చీకటి వెలుగుల (చీకటి వెలుగుల)
1975 గాజుల కృష్ణయ్య (నవ్వులు రువ్వే పువ్వమ్మా)
1975 కొత్త కాపురం (కాపురం..)
1976 రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ ( నాపేరు బికారి)
1978 ఇంద్ర ధనస్సు (నేనొక ప్రేమ పిపాసిని)
1978 అన్నదమ్ముల సవాల్ (నాకోసమే నీవున్నది)
1978 ఓ హంస భలే రామచిలుకా (ఏజెంట్ గోపీ)
1979 సుధా రాగసుధా (ముత్తయిదువ)
1980 చుట్టాలున్నారు జాగ్రత్త (అపనా తనామనా)
1994 నెంబర్-1 (ఛాంగుభళ)
యాంకర్ -6
తెలుగు చలనచిత్రరంగం కథానాయకులలో నాలుగుస్తంభాల ఆటలా ఉండేది. గత తరంలో ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణల తరం తరువాత యువతరం తెరంగేట్రంచేసింది.నాటి నవతరం ప్రతినిధులు చిరంజీవి, బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేశ్. వీరందరికీ బాలసుబ్రహ్మణ్యమే గాన సుబ్రహ్మణ్యం. ముందుగా చిరంజీవికి బాలు పాటలను చెప్పుకోవాలి.
వాయిస్-6
ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ తర్వాత తరంలో నాలుగు మూల స్తంభాలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లకు బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు. చిరంజీవి 1978లో నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదులో ఏతమేసి తోడినా పాట జాలాది కలంనుంచి ప్రవహించగా బాలు గళం నుంచి జాలువారింది.ఇది జీవన తాత్వికతకు అద్దంపట్టే హృద్య గీతం.1984లో అభిలాష చిత్రంలో బంతీ చేమంతి పాట ఇళయరాజా కొత్త సంగీత సొగసులను పరిచయం చేసింది. 1984లో ఛాలెంజ్ చిత్రంలో ఇందువదనానికి చందనాలు అద్దిన వేటూరి పాటను ఇళయరాగాలతో తన గళం నుంచి బాలు ప్రేక్షకులకు చేర్చాడు1987లో వచ్చిన పసివాడి ప్రాణం కశ్మీర్ లోయల అందాలను ఆవిష్కరించింది. 1988లో రుద్రవీణలో తరలిరాద తనే వసంతం, 1991లో విడుదలైన ‘రౌడీ అల్లుడు’లో బప్పీలహరి స్వరాల్లో వెలువడిన ‘చిలుకా క్షేమమా’ గీతాలు ప్రేక్షకులు కోరుకున్న కొత్తదనాన్ని అందించాయి. అదే ఏడాది ‘గ్యాంగ్ లీడర్’ లో భద్రాచలం కొండ అనే గీతం, 1992లో ఘరానా మొగుడులో ‘బంగారు కోడిపెట్ట’ పాటలు ఆకట్టుకున్నాయి. 1998లో చూడాలని ఉందిలో సింబలే..సింబలే గీతం, 2002లో ఇంద్ర లో ఘల్లు..ఘల్లు పాటలు బాలు గాత్ర వైవిధ్యానికి మచ్చుతునకలు.Graphics-6
1978ప్రాణం ఖరీదు (యాతమేసి తోడినా..)
1984అభిలాష (బంతీ చేమంతి)
1984ఇందువదన కుందరదన (ఛాలెంజ్)
1987 పసివాడి ప్రాణం (కశ్మీరు లోయలో కన్యాకుమారిలో )
1988 తరలిరాద తనే వసంతం (రుద్రవీణ)
1991శుభలేఖ రాసుకున్నా (కొండవీటి దొంగ)
1992 రౌడీ అల్లుడు (చిలుకా క్షేమమా)
1991 భద్రాచలం కొండ (గ్యాంగ్ లీడర్)
1992 ఘరానా మొగుడు ( బంగారు కోడి పెట్ట)
1998 చూడాలని ఉంది (యమహానగరి)
2002 ఇంద్ర (ఘల్లు..ఘల్లు.)
యాంకర్ -7
తెలుగు సినీ ప్రపంచంలో నటరత్న నందమూరి తారకరామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ విజయయాత్రకు బాలసుబ్రహ్మణ్యం పాటలు ఎంతో తోడ్పడ్డాయి. వందకు పైగా చిత్రాలలో నటించినా వాటిలో ప్రేక్షకులను సమ్మోహనపర్చిన పాటలున్నాయి. ఎస్పీబాలు బాలయ్యల కాంబినేషన్ క్లిక్ అయ్యింది.
వాయిస్-7
నందమూరి బాలకృష్ణకు బాలసుబ్రహ్మణ్యం హిట్ సాంగ్స్ ఇచ్చారు. మంగమ్మగారి మనవడులో దంచవే మేనత్తకూతురా, సీతారామ కల్యాణం లో కల్యాణ వైభోగమే, రక్తాభిషేకంలో బందారు చిన్నదాన, ఆతిత్య 369లో జాణవులే, వరవీణవులె, ధర్మక్షేత్రంలో కొరమీను కోమలం గీతాలుయ అభిమాన ప్రేక్షకలోకాన్ని మెప్పించాయి.
1993లో వచ్చిన బంగారు బుల్లోడులో గుడివాడ గుమ్మరో, మరో పాట స్వాతిలో ముత్యమంత, బొబ్బిలి సింహంలో మాయదారి పిల్లడా పాటలు సూపర్ హిట్స్. అలాగే సమరసింహారెడ్డిలో నందమూరి నాయకా, మరో గీతం రావయ్యా ముద్దుల మామ, నరసింహనాయుడులో లక్స్ పాపా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భక్తిప్రధాన చిత్రాలయిన పాండురంగడులో మాతృదేవోభవ పాట బాలు పాటల్లో ఒక తారస్థాయి గీతం. శ్రీరామ రాజ్యంలో జగదానంద కారకా పాట దేశవిదేశాల్లో బాలసుబ్రహ్మణ్యం కు ఎనలేని, ఎల్లలు లేని కీర్తిని తెచ్చింది.
Graphics-7
1984 మంగమ్మగారి మనవడు (దంచవే మేనత్త కూతురా)
1986 సీతారామ కల్యాణం (కల్యాణ వైభోగమే)
1988 రక్తాభిషేకం బందారు చిన్నదాన
1991 ఆదిత్య 369 జాణవులే వరవీణవులే
1992 థర్మక్షేత్రం (కొరమీను కోమలం)
1993 బంగారు బుల్లోడు (గుడివాడ గుమ్మరో, స్వాతిలో ముత్యమంత)
1994 బొబ్బిలి సింహం (మాయదారి పిల్లడా)
1998 సమరసింహారెడ్డి (నందమూరి నాయకా రావయ్య ముద్దుల మామ)
2001 నరసింహ నాయుడు (లక్స్ పాపా)
2008 పాండు రంగడు (మాతృదేవోభవ)
2011 శ్రీరామరాజ్యం (జగదానంద కారకా)
యాంకర్-8
అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడు అక్కినేని నాగార్జునకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు ఎంతో విజయమవంతమై నాగార్జున కెరీర్ కు బాటవేశాయి. ప్రేమచిత్రాల నుంచి భక్తి చిత్రాల వరకు బాలు గానం చేసిన పాటలు మైలురాళ్లుగా నిలిచాయి.
వాయిస్-8
అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడుగా రంగప్రవేశం చేసి, కొద్ది కాలంలోనే సొంత ముద్ర ఏర్పర్చుకున్న నటుడు, ఆయన తనయుడు నాగార్జున. ఆయన నటించినఆఖరిపోరాటం సినిమాలో లతామంగేష్కర్ తో కలసి బాలు పాట అందరినోటా నానింది. శివ సినిమా కోసం బాలు, చిత్ర గానం చేసిన ఎన్నియల్లో..మల్లియల్లో వైవిధ్యంగా సాగింది.ఒకప్పుడు వేటూరి కలం, బాలూ గళం, ఇళయరాజా స్వరం..ఈ కాంబినేషన్ ను కొట్టిందే లేదు. గీతాంజలి సినీగీతం ‘ఓ పాపాలాలీ ఇందుకు ఉదాహరణ. ఇక నిర్ణయంలో హలోగురు ప్రేమకోసమే పాట యువతరాన్ని ఆకర్షించింది. కాలేజీ రోజులలో చిలిపి తమాషాలు, మధుర జ్ఞాపకాలను ముందుంచే గీతం అల్లరి అల్లుడులో నూనూగు మీసాల నూత్న యవ్వనంలో పాటను బాలు గళం గమ్మత్తుగా ఆవిష్కరించింది. రాజ్-కోటి స్వరాలలో బాలు, చిత్ర పాడిన ‘ ప్రియరాగాలే’ వినూత్న బృందగానంతో అలరించింది. క్రిమినల్ లో కీరవాణి మధురస్వరాలు అద్దిన తెలుసా, మనసా గీతం మధురతుషారాలు అద్దింది. అన్నమయ్యలో పురుషోత్తమా..కలగంటి..కలగంటి గీతాలు బాలు గళం నుంచి శృతి పక్వంగా ప్రవహించాయి. నువ్వు వస్తావని సినిమాలో పాటలపల్లకివై పాట ఓ మధుర గీతం. ఇక అన్నమయ్య తర్వాత అక్కినేని నాగార్జున తనను తాను నిరూపించుకున్న ఆధ్యాత్మిక చిత్రం శ్రీరామదాసు. ఈ సినిమాలో అంతా రామమయం, ఎంతో రుచిరా గీతాలు బాలు గళంతో ప్రాణం పోసుకున్నాయి.
Graphics-8
1988 ఆఖరిపోరాటం (తెల్లచీరకు తకధిమి)
1989 శివ (ఎన్నియల్లో..)
1989 గీతాంజలి (ఓ పాపా లాలీ, ఎన్నియల్లో)
1991 నిర్ణయం (హలో గురు ప్రేమ కోసమే)
1993అల్లరి అల్లుడు (నూనూగు మీసాల)
1994 హలో బ్రదర్ (ప్రియరాగాలే)
1995తెలుసా మనసా (క్రిమినల్)
1997పురుషోత్తమా, కలగంటి..కలగంటి (అన్నమయ్య)
1999 ఆకాశ వీధిలో (స్వప్నవేణువేదో..)
2000 పాటల పల్లకివై (నువు వస్తావని)
2009 అంతా రామమయం, ఎంతో రుచిరా (శ్రీరామదాసు)
యాంకర్-9
ఎన్టీఆర్, ఏయన్నార్ తరం తరువాత వచ్చిన నలుగురు కథానాయకుల్లో వెంకటేష్ కు కుటుంబ కథా చిత్రాల కథానాయకుడుగా పేరుంది. ఆయన సినీ గీతాలకు బాలు గళం ఎంతో వన్నెతెచ్చింది. వారి కాంబినేషన్ లో అనేక పాటలు సూపర్ హట్స్ గా నిలిచాయి.
వాయిస్ -9
కుటుంబ కథా చిత్రాల కథానాయకుడుగా పేరున్న వెంకటేశ్ కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలున్నాయి. 90 శాతం సినిమాలకు బాలసుబ్రహ్మణ్యమే పాడారు. అనేక గీతాలు ప్రేక్షకులను అలరించారు. 1987లో గౌతమితో కలసి నటించిన శ్రీనివాసకల్యాణంలో తుమ్మెద..ఓ తుమ్మెద కలకాలం గుర్తుండిపోతుంది. 1988లో విడుదలైన విశ్వనాథ్ చిత్రం స్వర్ణకమలంలో కొత్తగా రెక్కలొచ్చెనా పాటను ఎంతో సొగసుగా వెంకీని ఆవహించినట్లు గానం చేశారు. అదే ఏడాది ప్రేమ సినిమాలో హీరో హీరో, అలాగే ప్రియతమా నా హృదయమా పాటలు ఆదరణ పొందాయి. 1989లో ధృవనక్షత్రంలో పెళ్లి పెళ్లి అనే పాట హవాహవా పాప్ సాంగ్ శైలిలో సాగే హుషారుగీతం 1990లో ప్రేక్షకులను పలకరించిన బొబ్బిలిరాజా లో బలపం పట్టు భామ ఒళ్లో, శత్రువు సినిమాలో పొద్దున్నే పుట్టింది పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి.క్షణక్షణంలో జామురాతిరీ, ఘనవిజయం సాధించిన చంటిలో అన్ని పాటలు సినీ ప్రేక్షకులను అలరించాయి. తర్వాత విడుదలైన సుందరాకాండలో నవ్వవే నవమల్లిక పాట, 1996లో ప్రేమించుకుందాంలో మేఘాలే తాకింది, 1997లో పెళ్లి చేసుకుందాం చిత్రంలో మనసున మనసై, 1998లో ప్రేమంటే ఇదేరా సినిమాలో నాలో ఉన్న ప్రేమ, 1999లో రాజాచిత్రంలో ఏదో ఒక రాగం, 2001 నువ్వు నాకు నచ్చావ్‌లో ఆకాశం దిగివచ్చీ., 2007 ఆడవారి మాటలకు అర్ధాలే వేరులేలో అల్లంత దూరాల గీతాలకు బాలసుబ్రహ్మణ్యం ప్రాణం పోశారు.
Graphics-9
1987 శ్రీనివాస కల్యాణం (తుమ్మెద ఓ తుమ్మెద)
1988 స్వర్ణకమలం (కొత్తగా రెక్కలొచ్చెనా)
1988 ప్రేమ (హీరో హీరో orప్రియతమా నాహృదయమా..)
1989 ధృవ నక్షత్రం (పెళ్లి..పెళ్లి హవాహవా పాట శైలిలో)
1990 బొబ్బిలిరాజా (బలపం పట్టు భామ)
1990శత్రువు (పొద్దున్నే పుట్టింది)
1991 క్షణ క్షణం (జామురాతిరి)
1992 చంటి (ఎన్నెన్నో అందాలు or పావురానికి..)
1992 సుందరాకాండ (నవ్వవేనవమల్లికా)
1993 అబ్బాయి గారు (కూసింది కోయిలమ్మ)
1996 ప్రేమించుకుందాం రా.. (మేఘాలే తాకింది హైలెసా)
1997 పెళ్లి చేసుకుందాం (మనసున మనసై)
1998 ప్రేమంటే ఇదేరా (నాలో ఉన్న ప్రేమ)
1999 రాజా (ఏదో ఒక రాగం)
2001 నువ్వు నాకు నచ్చావ్ (ఆకాశం దిగివచ్చీ..)
2007 ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే (అల్లంత దూరాల)
యాంకర్ -10
విశ్వనాదం అంటే కాశీ విశ్వనాథుడేనా. తెలుగువారి కే.విశ్వనాథుడా? మన లలితకళా, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలన్న సత్ సంకల్పం ఓ శుభముహూర్తంలో ఆయనలో శుభసంకల్పమైంది. ఎప్పుడో చెల్లిలికాపురం సినిమాలో పడిన బీజం సిరిసిరి మువ్వ లో లీలగా కనపడింది. శంకరాభరణం సినిమాతో పూర్తిగా బయటికి వచ్చింది. విశ్వనాథుడు ఎన్ని సినిమాలు చేసినా ఆయన సంగీత, సాహిత్య, నృత్య సమలంకృత సినిమాల ద్వారా విశ్వ..నాదంగా మోగింది మాత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే.
వాయిస్ -10
కె. విశ్వనాథ్ అంటే విశ్వ..నాదం. అవును ఆయన తెలుగుపాట నవరవళింపులను విశ్వానికి చాటారు. ఆయన చిత్రాలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గళం ప్రపంచమంతా పరిచయమైంది.లలితకళారాధనకు జాతి తనను తాను శృతి చేసుకోవటానికి, దూరమవుతున్న సాంస్కృతిక విలువలు, మృగ్యమైన మానవ సంబంధాలను తిరిగి అద్దాలన్న తపనతో సంగీత, నాట్య ప్రధాన చిత్రాలకు శంకరాభరణంతో శ్రీకారం చుట్టారు. అంతకుముందే మూడేళ్ల ముందే సిరిసిరి మువ్వలో నమూనాగా మురిపించే మువ్వలను పరిచయం చేశారు. అటువంటి సినిమాలకు బాలసుబ్రహ్మణ్య గళం ప్రాణాస్పందంగా నిలిచింది. శంకరాభరణంలో శంకరశాస్త్రి తనపట్ల సాటి మనుషుల ప్రవర్తనకు మనస్థాపం చెందుతాడు. భగవంతునికి తన ఆవేదనను, బాధను నివేదించిన పాట శంకరా..నాదశరీరాపరా.. ఆ చిత్రంకోసం బాలును మహదేవన్ సహ సంగీత దర్శకుడు పుహళేంది సంసిద్ధుల్ని చేశారు. శాస్త్రీయ సంగీతాన్ని ఔపాసన పట్టేలా ప్రోత్సహించారు. అన్ని పాటలూ ప్రేక్షకులు హృదయాలను ఆర్ద్రంగా పలకరించాయి. వాటిలో శంకరా నాదశరీరాపరా, దొరకునా ఇటువంటి సేవ గీతాలు కకలకాలం గుర్తుండిపోతాయి. 1983లో వెండితెరకెక్కిన దశ్యకావ్యం సాగరసంగమం. బాలు గానం చేసిన ‘వేదం అణువణువున నాదం’,‘మౌనమేలనోయి’ పాటలు కలిసి ప్రేక్షకులను గుమ్మెత్తించాయి.1985లో ప్రేక్షకులను పలకరించిన స్వాతిముత్యం లో అణువు అణువు ప్రణయ మధువు గీతాన్ని బాలు జానకమ్మ యుగళంలో మంత్రముగ్ధుల్ని చేసింది.సువ్వి..సువ్వీ సువ్వాలమ్మ కలకాలం గుర్తుండే పాట.
1985లో సిరివెన్నెల. సినీనేపథ్యగానంపై కురిసిన సిరివెన్నెల.. విధాత తలపున సత్‌సంకల్పం ప్రభవించి బాలు గళాన్ని భరతజాతికి కానుకగా రాసిచ్చారు కావచ్చు. ఈగాలీ, ఈ నేలా, సెలయూరూ..అంటూ సెలయేటి పాటయ్యారు. నేపథ్యగాన ప్రపంచాన్ని సుసంపన్నం చేశారు... అందుకే ఆయన విశ్వమంతా బాలుపాటలే వినపడుతున్నాయి. 1987 ఆత్మగౌరవం, స్వయంకృషితో ఎలా ఎదగవచ్చో చాటిన చిత్రం..స్వయంకృషిలో రమేశ్ నాయుడు స్వరాల్లో బాలు గళం హుషారుగా పరుగెత్తింది. 1989లో సూత్రధారులులో లాలీలో ..గీతం ఆనందడోలికల్లో ఓలలాడించింది. 1992లో వచ్చిన స్వాతి కిరణం...అసూయ ఎంతటి చేటుచేస్తుందో, గురుస్థానంలో ఉన్నవాళ్లు ఉదాత్తంగా వ్యవహరించకుంటే ఎన్ని అనర్ధాలు వస్తాయో తెలియజెప్పే సందేశాత్మక సినిమా స్వాతికిరణం. ఇందులో మమ్ముట్టిపై చిత్రీకరించిన శివాణీ- భవానీ గీతం అందరినీ అలరించింది. 1997లో విడుదలైన శుభసంకల్పంలో సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు ఒక హృద్యగీతం.
Graphics-10
మానవసంబంధాలకు పట్టం
లలితకళా చిత్రాలకు ప్రాధాన్యం
1979 శంకరాభరణం (శంకరా, నాదశరీరాపరా)
1983 సాగరసంగమం (వేదం అణవణువున నాదం)
1985 స్వాతిముత్యం (అణువు అణువు, సువ్వీ సువ్వీ)
1985 సిరివెన్నెల (విధాత తలపున)
1987 స్వయం కృషి (పారా హుషార్)
1989సూత్రధారులు (లాలీలో..)
1992 స్వాతి కిరణం (భవానీ-శివానీ)
1997 సీతమ్మ అందాలు (శుభసంకల్పం)
యాంకర్ -11
అనేక భాషా కథనాయకులకు, హాస్య నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు కలిపి దాదాపు వందమందికి పాడారన్నది ఓ అంచనా. నిర్ధారిత నిజం కాదు. తాత నుంచి మనవడి దాకా అనేక తరాలకు పాడాడు నిజం. తరతరాలకు పాడుతున్నారు. తరాలుగా పాడుతూనే ఉన్నారు వరాల, శత కంఠ స్వరాల బాలు.
వాయిస్-11
అతడు ఒకే ఒక్కడు. తెరమీద ఎందరు కథానాయకులు ఉన్నప్పటికీ తెరవెనుక కథానాయకుడు ఒక్కడే. అతడే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. దానకర్ణుడు. గాత్రదాన కర్ణుడు. అందరికీ పాటలిస్తాడు. కొందరికి మాటలిస్తాడు. నటనలో శారీరక భాషకు గళభాషను చేర్చిన ప్రతిభావంతుడు గానలోలుడు. 74 ఏళ్ల బాలుడు. అతడు అందరికోసం ఒక్కడుగా నిలిచిన ఒకే ఒక్కడు.తెరంగేట్రం చేసే ప్రతి హీరో, పాటపాడే ప్రతి పాత్రకు బాలు గాత్రమే. నాడు ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణ పాటలు పాడారు. తర్వాత అదే తరంలో హరనాథ్, అల్లు రామలింగయ్య, కాంతారావు, పద్మనాభం, రాజబాబు, నాగభూషణం, చంద్రమోహన్, చలం, మురళీమోహన్ , రావుగోపాలరావు, కృష్ణం రాజు, రామకృష్ణ , రామ్మోహన్ , రంగనాథ్, నరసింహరాజు, హరిప్రసాద్, సత్యేంద్ర కుమార్, మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తి, భనుచందర్, ఎన్టీరామారావు తనయులు బాలకృష్ణ, హరికృష్ణలకు పాటలు పాడారు. హరికృష్ణ తనయులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారక్ రత్న లకు పాట సాయం చేశారు. హీరో కృష్ణ కుటుంబంలో రమేశ్ బాబు, మహేశ్ బాబు, అందరి పాటలకు బాలు తన గాత్రంతో ప్రాణప్రతిష్ఠ చేశారు. (స్పాట్స్ వేసుకోవచ్చు)
యాంకర్-12
తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద పండుగ స్వరాభిషేకం. సంగీత ఆరాధనోత్సవం. సంగీత, సాహిత్య సమలంకృతంగా, తెలుగు సినీ సంగీత సంగతుల ఆవిష్కరణగా విలసిల్లుతున్న సుమధుర కార్యక్రమం స్వరాభిషేకం. రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుగారి మానసపుత్రిక ఈ కార్యక్రమం. సమయానికి తగుమాటలాడే సత్కార, ప్రశంసాతోరణం. హృద్యమైన అభిభాషణం.రవళించే జ్ఞాపకాల జావళి.
వాయిస్-11
ప్రతిభ ఉండీ, రాగాలు నేర్చుకునే శక్తిలేక జీవనరాగంతో రాజీపడిన అనేక నవయువ స్వరాలను బాలు తట్టిలేపారు. సీహెచ్ రామోజీరావుగారు నిర్మించిన ఈటీవీ పాడాలని ఉంది ద్వారా బాల, యువ స్వరాలను వెలుగులోకి తీసుకొచ్చారు. తర్వాత సీహెచ్ రామోజీరావుగారు ఇదే క్రమంలో స్వరాభిషేకం కార్యక్రమం తీసుకొచ్చారు. గాయకులు బోయీలుగా పాటలు పల్లకీలో విహరించే అపురూప కార్యక్రమం. దక్షిణ భారత టెలివిజన్ చరిత్రలో సువర్ణాధ్యాయం స్వరాభిషేకం. ఆ కార్యక్రమం ఎంతో ఆహ్లాదంగా, అలసిన మనసులకు సంగీత లేపనంగా రూపుదిద్దుకుంది. తెలుగుసినిమా పాటతో అతడిది ఎన్నెన్నో జన్మల రాగబంధం ఉన్న శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మార్గదర్శనంలో స్వరాభిషేకం ప్రేక్షకలోకాన్ని మైమరపిస్తోంది. స్వరాభిషేకంలో మంత్రపుష్పాలలా జ్ఞాపకాల చర్చ చందన చర్చితమౌతుంటే అందరూ మంత్రముగ్ధులై ఆస్వాదిస్తుంటారు. అతడి మాటలకు ఎదలోతుల్లో జ్ఞాపకాలన్నీ పొరలు చీల్చుకుని కన్నీటి తెరలుగా ఉబికి ఉబికి వస్తాయి.సినీబంధువులంతా ఆ జ్ఞాపకాల చలమలోకి, ఆ అనుభవాల కాసారంలోకి తొంగి చూసుకుని తమను తాము ‘గుర్తించు’కుంటారు. కలకాలం గుర్తుంచుకుంటారు.
సంగీత వాద్య బృందంలో ఏఏ కళాకారుడు ఏఏ పరికరంతో సహకరిస్తున్నాడో జ్ఞాపకం ఉంచుకుంటారు. సంగీత,సాహిత్య సమలంకృతం. అంతరంగాలలోని మధుర స్మృతుల ఆవిష్కరణకు అవార్డులు ఇస్తే ప్రథమ పురస్కారం ఆయనకే దక్కుతుంది. బాల సుబ్రహ్మణ్యం మెదడు పెద్ద మెమొరీ కార్డు. వేలవేల గిగాబైట్ల జ్ఞాన భాండాగారం. అతడితో సంభాషించడం అంటే తెలుగు సినిమా కనీస ఐదున్నర దశాబ్దాలు తన జ్ఞాపకాలను, వ్యాపకాలను నెమరువేసుకోవటం. దశాబ్దాల సంగీతయాత్ర గురించి వివరించే సందర్భంలో.. ఆ మాటకచేరీలో, ఆ పాటకచేరీలో అతడి స్మృతిపథాన్ని తాకని మనిషి వుండడు. తెలుగు తెలియని దర్శకులు, తెలుగు రాని గాయకులతో పాడించి నవ్యత పేరుతో మాతృభాషకు తీరని ద్రోహం చేస్తున్నారని బాలసుబ్రహ్మణ్యం బాధపడేవారు.‘స్వరాభిషేకం’ శీర్షికతో రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుగారు సంగీత పాటకచేరీలకు శ్రీకారం చుట్టారు. ప్రతిభావంతులైన కళాకారులకు నీరాజనాలర్పించే స్వరాభిషేకం పాటల పల్లకీకి పచ్చకల్యాణం. సంగీతానికి నిత్యఆరాధనోత్సవం. ఎన్నో వసంత వేళలు వచ్చి పోతున్నా ఈ కార్యక్రమం సంవత్సరాలుగా విజయవంతంగా అనేక తరాలను, స్వరాలను గౌరవించే విశిష్ట, ఉదాత్త కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ఆ కార్యక్రమం సుసంపన్నం కావటంలో వ్యాఖ్యాత సుమ, ప్రయోక్త ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికే దక్కుతుంది. ఈటీవీ 20 ఏళ్ల వేడుకల సందర్భంలో సినీ దిగ్గజాల సమక్షంలో ప్రవహించిన పాటలు కలకాలం గుర్తుండిపోతాయి. మధురస్మృతులలా మదిలో నిలిచిపోతాయి. ఎందరో మహానుభావుల సమక్షంలో అందరినీ తల్చుకుంటూ..వారందరూ తనజోలెలో కొన్ని పాటలు వేయడం వల్లనే తానింతటి స్థాయికి వచ్చానని సదా సదా..సర్వదా చాటుకునే వినయ సంపన్నుడు. సినీగానంలో శిఖరసమానుడు.జ్ఞాపకాలతో కడిగేస్తుంటే చెమ్మగిల్లని కళ్లు ఉంటాయా? ఓ కవి అన్నట్లు కాలికి తడి అంటకుండా సముద్రాలు దాటవచ్చు. కానీ కంటికి తడి అంటకుండా జీవితాన్ని దాటలేరు. జీవితంలో మనం ఇన్ని మంచిపనులు చేశాం. ఇంత ఉపాకరం చేశాం అని ఆత్మ సంతృప్తితో సమీక్షించుకునే సందర్భాలకంటే విలువైన క్షణాలేముంటాయి?
అందరిమోమున నవ్వులు పూయిస్తూ, గుడికట్టుకుని ఆరాధించే మహానుభావులకు గుండెనిండా గుడిగంటలతో స్వరనైవేద్యం పెడుతుంటే అంతకంటే జీవితానికి సార్ధకత ఏముంటుంది? సంగీత ప్రపంచానికి కొన్ని తరాలను తయారుచేసిస్తుంటేజన్మ ధన్యం కాదా?
ఎండ్ వాయిస్
బాలసుబ్రహ్మణ్యం అర్ధశతాబ్దానికి పైగా తెలుగు సినీ నేపథ్య గానాన్ని రాగరంజితం చేస్తూ వస్తున్నారు. సంగీతంతో, సినీనేపథ్య గానంతో ఆయనది ఎన్నెన్నో జన్మల బంధం. అది ఎన్నటికీ వీడని రాగబంధం. పరిమళ గంధం. గంధర్వులే ఆవహించారేమో. ఆయన గానంతో మధుర తుషారాలు మనసు తాకాయి. మధువనాలు మళ్లీ పూస్తుంటాయి. బాలు గళం చలువ పందిరి కింద కొత్త తాటాకు సుగంధం. మాఘమాసంలో నారింజపరిమళం. అందులో తేనె వాగులు, మేలిముత్యాలు, వెన్నెల సోనలు వుంటాయి.మరికొన్ని దశాబ్దాలు ఇదేపాట ఇలాగే పాడుకోవాలి. ఆయనకు వార్థక్యం లేదు. సంగీతజగాన సప్తస్వరాలే వసంత రాణులై ఆయన ఎదుట మయూరాల్లా నాట్యం చేస్తుంటాయి. ఆ వయసు గులాబి పువ్వై గుబాళిస్తుంది. ఆ గళం నుంచి రాగరంజిత గానం ప్రవహిస్తూనే ఉండాలి. ప్రేక్షకలోకం పరవశిస్తూనే ఉండాలి.
Comments
Post a Comment