Posts

నలవోలు నర్సింహా రెడ్డి పద్యాలు

Image
........ పొడుపు పద్యము ........ ఆ. పొగడ చెట్టు కేది పోల్చి చెప్పెడు పేరు..?  మోద మలరు పేరు మొగ్గ కేది  ..? అద్దమునకు నొండు ముద్దైన పేరేది..? మూట నొక్క మాట ముద్దు బాల..!   540 జవాబు … ? (నిన్నటి జవాబు .. సత్తా) [05/02, 6:22 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........ తేనియల్ చిందు నా భాష తెలుగు భాష డా. నలవోలు నరసింహా రెడ్డి ........ పొడుపు పద్యము ........ నిద్ర తీరి పోవ నెలకొనునది యేది..?  వర్తనమున కేది వరలు పలుకు  సరసమైన మాట జాగరూకతకేది  మూట నొక్క మాట ముద్దు బాల..!   541 జవాబు … ? (నిన్నటి జవాబు .. ముకురము, ముకురం) [06/02, 6:50 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........ తేనియల్ చిందు నా భాష తెలుగు భాష డా. నలవోలు నరసింహా రెడ్డి ........ పొడుపు పద్యము ........ ఆ. ఏది పోనీ ధైర్య మిలను వీరున కుండు ..? కాల్తు రెట్టి జొన్న కండె దినగ..?   చిన్ని చెట్టు కేది చెన్నుమీరెడు పేరు..?  మూట నొక్క మాట ముద్దు బాల..!   542 జవాబు … ? (నిన్నటి జవాబు .. మెలకువ) [07/02, 6:17 am] Narsimhare...