పొట్టోల్ల లహరి 9వ తరగతి ZPHS గుఱ్ఱాలగొంది
Saturday, April 11, 2020
లహరి మణిపూసలు
ZPHS గుఱ్ఱాలగొంది
జిల్లా సిద్దిపేట
బతుకమ్మ మణిపూసలు
11
బతుకమ్మ వచ్చేను
సంబరాలు తెచ్చెను
చిన్న పెద్దలంత కలిసి
గౌరి పూజచేసెను
12
వేకువనే లేచాము
అడవిలోకి వెళ్ళాము
పువ్వునంత తీసుకొచ్చి
వేరు చేసి పెడతాము
13
అందరము చేరుతాం
పువ్వంత తెంపుతాం
కట్టలేన్నొ కట్టియు
బతుకమ్మ పేర్చుతాం
14
వాడలందు నిలుపుదాం
పాటలెన్నొ పాడుదాం
పాడినంక తీసుకొని
చెరువులోన వేయుదాం
15
వయనాలను పంచాము
ఫలహారము తిన్నాము
పాటలెన్నొ పాడుకుంటు
పరవశించి పోయాము
సావిత్రీబాయి గారు
నైగావ్ లో పుట్టినారు
పాటిల్ గారి ఇంటిలో
పెద్ద కూతురు అయ్యారు
17
అమ్మనాన్నలు కలిశారు
ఆమెకు పెళ్లి చేశారు
ఆమె బయట కెళ్ళకుండ
ఇంటిలోన ఉంచెవారు
18
సావిత్రిబాయి గారు
సేఠ్ జి దగ్గరి కెళ్ళారు
అతడు రోజు సావిత్రికి
కథలు చెప్పు తుండెవారు
19
సేఠ్ జి గారు ఆమెను
చదువు చదివి పించెను
స్త్రీలకేమొ బడి పెట్టి
పంతులమ్మ చేసెను
వివిధ మణిపూసలు
20
ప్లేగు వ్యాధి సోకింది
ఆమె చచ్చిపోయింది
ఇలా ఆమె జీవితం
చివరి దాక గడిపింది.
21
కోడి గుడ్డు పెట్టింది
అక్క వెళ్లి తెచ్చింది
అమ్మ చేతి కివ్వగను
అట్లు పోసి ఇచ్చింది
22
పొద్దున నేను లేచాను
చకచక పనులు చేశాను
స్నేహితులతో కలిశాను
పాఠశాలకు వెళ్లాను
23
మట్టి గాజులుకొన్నాను
చేతికి వేసుకున్నాను
గళ్ళుగళ్ళు మంటుంటె
మనసే పులకరించేను
24
చీపురుకట్ట పట్టాను
ఇల్లునంతను దులిపాను
బల్లి వచ్చి పడగానె
చాలా భయము వేసింది
25
మాకు ఉండెను కుక్క
దాని పేరు తిమ్మక్క
చెప్పినట్టు వింట దక్క
దానికి ఇష్టం బొక్క
26
బంతి తోటి ఆడాను
దెబ్బ నాకు తగిలేను
అమ్మ నన్ను తిట్టియు
మందులెన్నో వేసెను
చెట్టు మీద ఉండె పిట్ట
కూకూ యని అరిచె పిట్ట
అది ఎంతో మంచిదంట
నన్ను నిద్ర లేపె కొట్ట!
28
వార్తలన్ని చూశాను
విషయాలెన్నొ తెలిసెను
సారు ప్రశ్నలడిగినపుడు
జవాబులను చెప్పాను
29
కొత్త బ్యాగును కొన్నాను
పుస్తకాలను పెట్టాను
బడికి తీసుకు వెళ్ళాక
జాగ్రత్తగానె చూసాను
30
శివరాత్రియు వచ్చింది
జాగారం తెచ్చింది
కందగడ్డ ఉడకబెట్టి
మాకందరికిచ్చింది
31
అమ్మకు జ్వరము వచ్చింది
ఆసుపత్రికి వెళ్ళింది
ఆసుపత్రిలో డాక్టరమ్మ
మలేరియా జ్వరమన్నది
32
మైదాకంత తెంపాను
రోట్లెవేసియు దంచాను
మెత్తని ముద్ద కాగానె
చేతులనిండ పెట్టాను
33
నల్లా నీరు వస్తుంది
అమ్మ మోటార్ పెట్టింది
తిరిగి నీళ్లు పోయాక
దానిని బంధు చేసింది
34
చెల్లె సినిమా చూస్తుంది
అందున దయ్యం వచ్చింది
భయమేస్తుందని అనగా
అక్కఛానలుమార్చింది.
35
అల్లారం పెట్టాను
మోగ గానె లేచాను
పుస్తకము పట్టుకొని
పాఠాలను చదివాను.
36
కోమటి చెరువు వెళ్ళాము
రోపువేను ఎక్కినాము
పడవలో షికారు జేసి
బొమ్మలు చాల కొన్నాము
37
కొత్త చెప్పులు కొన్నాను
గుమ్మము ముందువిడిచాను
కుక్కలు వచ్చి వాటిని
నోటకరచుక వెళ్ళాయి
38
పొలము దగ్గర కెళ్ళాము
అందు మొలకను చల్లాము
పెరిగి పెద్దయ్యాక
నాట్లను వేసి వచ్చాము
39
ఇల్లును మేము కట్టాము
తెల్లని రంగు వేశాము
రంగు పైన మరో రంగు
పచ్చని రంగు వేశాము
40
చలి బాగా పెడుతుంది
అక్క స్వెటర్ వేసింది
మంట కాడ కూర్చొని
అందు చేయి పెట్టింది
41
చేయిబాగా కాలింది
ఆసుపత్రికి వెళ్ళింది
మందు పూసి నరసమ్మ
పట్టిని వేసి పంపింది
42
హైదరాబాద్ పోయాను
రంగులరాట్న మెక్కాను
బుర్ర గిర్రున తిరిగింది
చెక్క రొచ్చియు పడ్డాను
43
వాకిలి సాన్పు చల్లాము
సంక్రాంతి రథమేశాము
ఎరుపు,పచ్చ గులాబి
రంగు దాంట్లో అద్దాము
44
గబ్బిలమునే చూశాను
తలక్రిందులు వేలాడెను
రాత్రి ఇంట్లో చేరంగ
అందరికి భయమేసేను
45
కొత్తబట్టలు కట్టాను
ఫోటో షాపుకు పోయాను
పాసుపోర్టు దిగివచ్చి
హెచ్.యం.గారికిచ్చాను
46
పచ్చి కర్రతొ కొట్టొద్దు
కరెంటు వైరు తాగొద్దు
షాకుకొడితే ప్రమాదము
దానిచెంతను ఆడొద్దు
47
వర్షాకాల మొచ్చెను
వాడంత బురుదాయెను
ఆటలాడ బురద పడగ
అమ్మ చెవులను పిండెను
48
దుకాణానికి వెళ్లాను
కురుకురేలను కొన్నాను
కల్తి నూనె కలిసెనేమొ
వాంతులే ఎక్కువాయెను
49
కొత్త బట్టలు వేసాను
బయటికి వెళ్లి వచ్చాను
దిష్టి తగిలిందని అమ్మ
ఉప్పే పొయ్యిల వేసెను
50
నాన్న దుక్కి దున్నినాడు
ఉల్లి తౌటం చేశాడు
ఉల్లి ధర బాగుందని
పెంచి పెద్ద జేసినాడు
సైనికుడు
51
సరిహద్దులుంటరువీరు
సైనికులే వీరి పేరు
నిద్రాహారాలు లేని
పోరాటమెవీరి జోరు
52
పుట్టినూరు వదిలి పెట్టి
కన్నవాళ్ళ విడిచిపెట్టి
దేశసేవే ముఖ్యమని
కుటుంబాలువిడిచిపెట్టి
53
పుణ్యభూమిన జన్మించి
మనశ్శాంతిని మాకిచ్చి
శత్రుమూకల పోరాడి
విజయమే మనకందించి
54
మహానీయులై మీరు
మమ్ముల రక్షించారు
మీరు ఉంటేనే మేము
సుభిక్షంగ ఉంటాము
55
దేశ రక్షణకు మీరు
ప్రాణము లెక్కచేయరు
ముళ్ళ మీద చెలగాటం
నిత్య వాడుతుంటారు
సమ్మక్క - సారక్క
56
బంధువులంత కలిశాము
వ్యాను మాట్లాడుకున్నము
పాటలెన్నొ పాడుకుంటు
మేడారము వెళ్ళినాము
57
జంపన్న వాగెళ్ళాము
స్నాన మక్కడ చేశాము
క్యూ పద్ధతి పాటిస్తూ
సమ్మక్క దర్శించాము
58
బంగారమర్పించాము
వచ్చినోళ్ళకు పంచాము
కోట్ల భక్తులను చూస్తూ
జాతరను తిలకించాము
59
మహాభారతము వినగా
ధర్మమంటె తెలిసెనుగా
శ్రీకృష్ణ పరమాత్మ
గీత సారము చెప్పెగా
60
దొడ్డు రగ్గు మాకుంది
ఎర్ర రంగులో ఉంది
కప్పుకుని పడుకుంటే
చలియన్నది రాకుంది
61
చరవాణిని యందరు
వాడుతునే ఉన్నరు
మంచి మంచి విషయాలు
ఎన్నొ తెలుసుకున్నరు
62
పరీక్షలను రాశాను
మంచి మార్కులు వచ్చెను
అందుకు సార్లు నాకు
మెచ్చి బహుమతులిచ్చెను
63
ఆయనేగా అధినేత
ఆయనేగా జాతిపిత
స్వాతంత్రం కోసము
పోరాడిన గాంధి తాత
64
వడ్ల వారువచ్చెను
చెట్లనేము నరికెను
కొమ్మలన్ని నరికినంక
మొద్దులుగా జేసెను
65
కిటికి,తలుపులు చేశారు
వాటికి రంగులేశారు
ఎండకు ఆరపెట్టాక
ఇంటికి తీసుకొచ్చారు
66
ఇంటి కవియు పెట్టగ
ఇల్లు కంద మొచ్చెగ
గాలి వెలుతు రెక్కువ
అందు నుండి వచ్చెగ
67
శివుని గుడికిని వెళ్లాను
పూజలెన్నో చేశాను
కొబ్బరికాయ కొట్టుకొని
ప్రసాదములను పంచాను.
68
అడవిలోకి వెళ్లారు
వెదురు చెట్లు చూశారు
పేపరు బాగ వస్తుదని
ఆలోచన చేశారు
69
రంపము చేత పట్టారు
చెట్లను నరికి వేశారు
కంపెనీ తీసుకెళ్లి
మిషీనులలో వేశారు
70
ముక్కలు చేసిఇవ్వగ
మరొక మిషనుల వేయగ
గుజ్జు బయట తీశాక
పేపరు తయారవ్వగ
71
నోటు బుక్కులు చేశారు
షాపుకు తీసుకొచ్చారు
పిల్లలందరుకొన్నాక
ముద్దుగ రాత రాశారు
72
ప్రకృతిని కాపాడండి
భవిష్యత్తు మనదండి
ప్రకృతిలోని మన బతుకు
ముడిపడినదని తెలియుడి
73
టిక్కెట్లు తీసినాను
సినిమాకు పోయినాను
దేశభక్తి గలిగిన
సినిమానే చూశాను
74
తాత పతంగి పట్టాడు
తోకను అతుకు పెట్టాడు
మాంజదారముపెట్టియు
గాలి లోనికి విడిచాడు
75
అక్కకు బాధ వేసింది
చెరువు దగ్గరి కెళ్ళింది
చంద్రుని చూసుకుంటు
కన్నీళ్లెన్నొ కార్చింది
76
అందరము కలిశాము
ముగ్గులను వేశాము
రంగులెన్నో అద్దియు
గొబ్బెమ్మ పెట్టాము
77
కోళ్ళపందెం పెట్టారు
చూచె వారును వచ్చారు
పోటిలో డబ్బు పెట్టియు
గెలిచిన వారికి ఇచ్చారు.
78
సరిహద్దు లుండే వాడు
కాపలకాసె సైనికుడు
రాత్రి నిద్ర మరచిపోయి
దేశ సేవకై నిలిచాడు
79
పిల్లలను మరిచిచావు
భార్యనే విడిచినావు
సరిహద్దుల శత్రువులను
తరిమి తరిమి కొట్టావు
80
రిపబ్లిక్ డే దినము
రాజు లేని రాజ్యము
ప్రజలచే ఎన్నుకొనిన
పాలించుటె ముఖ్యము
81
బి.ఆర్.అంబేద్కర్ గారు
రాజ్యాంగము రాసినారు
దేశదేశాలు తిరిగి
రూపకల్పన చేశారు.
ఊరంతా లేచిరి
సందడినే చేసిరి
వసంత పంచమనియు
దేవుని గుడికెళ్ళిరి
83
అమ్మవారిని చూసాము
దేవతనంత కడిగాము
బొట్లు మాతకు పెట్టాక
పూజకు సిద్ధ పర్చాము
84
పంతులు గారు వచ్చారు
పూజ సామాను చెప్పారు
తీసుకొచ్చి ఇచ్చాక
పూజ మొదలు పెట్టారు
85
పాటలను పాడినాము
శ్లోకాలు చదివినాము
దూప దీప నైవేద్యం
వాగ్దేవికి పెట్టినము
86
చల్లని చూపే అమ్మది
మమ్ములను దీవించినది
ధవళ వర్ణ కాంతులల్ల
ధగ ధగామెరయు చున్నది
87
పీట పై పడుకున్నాను
పీడ కలలను కన్నాను
నాకు భయం వేసింది
అమ్మ దగ్గరి కెళ్ళాను
88
మూడున్నరకు చెల్లెను
ఇంటికి తోలు కొచ్చెను
కడుపునిండ తిన్నాక
రాత పనినే చేసెను
89
కూడవెల్లి కి వెళ్ళాము
శివలింగమును మొక్కాము
జాతర తిరిగి అందరం
బొమ్మలు కొనుక్కున్నాను
90
గడియారము మాగుంది
కాలాన్నే చెపుతుంది
బడికి నీవువెళ్ళమని
గంటకొట్టి చెపుతుంది
ఆటో నేను ఎక్కాను
సిద్దిపేటకు పోయాను
కథలు ఎట్లు రాయాలో
నేర్చుకొనినే వచ్చాను.
92.
వేప చెట్లు పెట్టారు
వాటికి నీరు పోశారు
ఎంతో బాగా పెరిగాక
వేపకాయలు అమ్మారు.
93
పొద్దున నేను లేచాను
నెట్టు ఓపెన్ చేశాను
విషయాలను తెలుసుకుని
మణిపూసలు రాశాను
94
కార్యశాలకు వచ్చాను
బాలల నేను కలిశాను
పెన్ను బుక్కులు ఇచ్చారు
చెప్పినవన్ని రాశాను
95
విషయ నిపుణులు వచ్చారు
చిన్న కథలను చెప్పారు
బాలలందరు వినగానె
మెదడుకు పదును పెట్టారు
96
గేయము నేను రాశాను
వచన కవితలు రాశాను
పరిశీలకులు మెచ్చియు
కవిగ నీవు ఎదుగుమనెను
97
ఇంటికి నే వచ్చాను
అమ్మ నే మెచ్చుకొనెను
సర్టిఫికెట్ చూసినాది
ఎంతో మురిసిపోయెను
98
మణిపూసలు రాశాను
గురువు చెంతకొచ్చాను
గురువు నన్నుమెచ్చాక
ఇంక రాస్త నన్నాను
99
యాదాద్రికే వెళ్ళాము
గుడి లోపలికి పోయాము
దేవుడి దర్శనమవగా
బయటకు మేము వచ్చాము
100
వరుసల నిలబడ్డాము
లడ్డూలను కొన్నాము
ప్రసాదమును పంచాక
గుడి పనులను చూశాము.
101
గోధుమపిండి తెచ్చాము
పప్పును ఉడుక పెట్టాము
పాకమును పట్టినంక
పప్పు దాంట్లో పెట్టాము
102
పిండిబాగ కలిపాము
రొట్టె నేమొ చేశాము
పూర్ణమందులో పెట్టి
బక్షాన్నే చేశాము
103
కడాయిలో వేశాను
ఎంతో బాగ కాలెను
దేవుళ్లకు పెట్టినంక
ఇష్టంగా తిన్నాను
104
కారులోన ఎక్కినాము
హైదరబాదు పోయాము
మోడలు స్కూలుకి వెళ్లి
అవార్డు అందుకున్నాము
105
అడవులే నశించాయి
చెరువు లెండిపోయాయి
పక్షులు జంతువులకేమొ
నీళ్లే కరువయ్యాయి
106
నాలుగు పిచ్చుకలుండెను
వాటికి దాహము వేసెను
అందులో తల్లి పిచ్చుక
నీళ్ళ కోసమని వెదికెను
107
ఊరంతా తిరిగెను
వెతికి వెతికి చూసెను
వాటికి ఒక దగ్గర
నల్లా కనిపించెను
108
తల్లి పిచ్చుక చూసింది
నల్ల పైనను కూర్చుంది
తన ఎడమ కాలితో
నల్లనేమో తిప్పింది
109
పిల్లలు నీరు త్రాగెను
వాటి దాహము తీరెను
అప్పుడు అవి గూటికి
సంతోషంగ వెళ్ళెను.
గుఱ్ఱాలగొంది మువ్వలు
110
బాలలకేమొ మా సారు
అంశాలన్ని ఇచ్చారు
వాటి మీదనే మమ్ములను
పాటలు రాయమన్నారు.
111
పిల్లలు యోచించారు
పాటలన్ని రాశారు
సారు వాటిని చూసియు
బాగున్నాయి అన్నారు.
112
పాటలన్నీటి కందరు
మంచి శీర్షిక పెట్టారు
విషయానికి తగ్గట్లు
భావననుసమ కూర్చారు
113
పాటలను జమచేశారు
పుస్తకములో వేశారు
ఫోటోలన్ని తీసుకుని
పాటల కింద వేశారు
114
కల్మషమంటనిబాలలు
మాబడిలోనీ పిల్లలు
పుస్తకానికి పేరుబెట్టె
"గుఱ్ఱాలగొంది మువ్వలు"
115.
మీటింగును పెట్టారు
డీ.ఇ.ఓ.ను పిలిచారు
వారి చేతుల మీదుగా
పుస్తకాలనిచ్చారు
116
తల్లిదండ్రులొచ్చిరి
మా పాటలు చూసిరి
మేము పాడుతుండగా
సంతోషము పొందిరి.
వివిధ మణిపూసలు
117
పాఠశాల కెళ్ళాను
టిఫిను నేను తిన్నాను
బడిలో గంట కొట్టంగ
వరుసన నిలబడ్డాను
118
గోల్కొండకు పోయాము
ఫోటోలెన్నొ దిగాము
సంతోషంగ తిరిగాక
వెళ్లి కారు ఎక్కాము
119
అడవికి మేము వెళ్ళాము
పచ్చచిగురునుచూశాము
ప్రకృతి దృశ్యాలు జూస్తు
సంతోషంగ గడిపాము
120
జారు బండ ఎక్కుదాం
జర్రు జర్రు జారుదాం
బుద్ది ధీర దాకజారి
ఉయ్యాలలు ఊగుదాం
121
పతంగులను కొన్నాము
తోక నతుక పెట్టాము
దారమును కట్టినంక
పైకి నెగుర వేశాము
122
మాకు ఉండెను కుక్క
దాని కిష్టము బొక్క
తింటే గాని దానికి
నిద్ర పట్టదె అక్క
123
ఖోఖో ఆట ఆడాము
అందరినౌటుచేశాము
మేము ఆటలో గెలువంగ
బహుమతి అందుకున్నాము
గణపతి, మూషికాల స్నేహం
124.
గణపతి ఎలుకలు కలిసెను
చెట్టు కిందికి వెళ్ళేను
గంప నిండా లడ్డూలు
వెంటను తీసుకవెళ్లెను
125
ఎలుకలన్నికలిసెను
తాడు వెతికి తెచ్చెను
చెట్టుకొమ్మకు తాడుతో
ఊయలాను గట్టెను
126
గణపతికూర్చుండెను
ఎలుకలూయ లూపెను
దేవునికి లడ్డూలు
ఘనముగ అందించెను
127
గణపతి లడ్డూలను
కడుపునిండా తినెను
సంతోషంగ ఆడుకొని
ఇంటికెవెళ్ళి పోయెను
128.
స్నేహానికి గుర్తుగా
సేవచేసే గొప్పగా
గణపతి వాటి సేవకు
పొంగిపోయె నిండుగా
కరోనా వైరస్ మణిపూసలు
129
కరోన వైరసు వచ్చెను
మృతుల సంఖ్యయే హెచ్చెను
జగమంత హడలిపోతు
భయముతో వణుకుచుండెను
130
చేతులు కడుక్కోవాలి
మాస్క్ లను ధరించాలి
కరోన పోవాలంటే
జాగ్రత్తలు వహించాలి
131
చైనాలో పుట్టింది
కరోనగా మారింది
కనబడి నోళందర్ని
వెంటబడి తరుముతుంది
132
వేల మందిని చంపింది
పరదేశాల కెళ్ళింది
పరుగు పరుగున జనముపై
విజృంభిస్తూ వచ్చింది.
133
మందులు మాకులు లేవండి
నివారణే ముఖ్యమండి
కలిసికట్టుగా ఉంటెను
కరోనమాయమౌనండి
134
షేకు హ్యాండులు ఇవ్వద్దు
మందిల బాగా తిరుగొద్దు
ఇంట్లో క్షేమంగుండాలి
వీధి లెప్పుడు తిరగొద్దు
జలసంరక్షణ
135
చెట్లేమొ లేకపాయె
వర్షాలే కరువాయె
ఇవి రెండు లేకపోతె
నీళ్ళే దొరకవాయె
136
అడవులను పెంచాలి
వర్షాలుకురువాలి
నీటి కొరత లేకుండా
మనమంత బతుకాలి
137
నీళ్లు మంచి గుంటేను
పంట బాగ పండేను
కరువులన్ని తీరిపోగ
ఆహారము దొరుకును
138
పొదుపుగనీరు వాడాలి
వచ్చె తరము బతకాలి
నీటి పొదుపు గూర్చి
విషయాలు తెలుసుకోవాలి
139
జనమంతయుమేలుకొండి
చెట్లు సంరక్షించండి
భూగర్భజలమెపుడు
విస్తారము లభించండి.
140
గడ్డ పారను పట్టాలి
ఇంకుడుగుంత తవ్వాలి
అందునా నీరు నిల్చిన
భూమిన నీరు పెరంగును
నాట్లు-మహిళ
141
రైతు ఊరికి వెళ్తాడు
ఇంటింటికి తిరుగుతాడు
కూలీల పిలుచుకవచ్చి
పొలము దగ్గరికెళ్తాడు
142
కూలీ లంత వస్తారు
పొలములోనను దిగుతారు
కొంగు నడుముకు చుట్టు కొని
వరి నారునే తీస్తారు
143
రైతులు నారు ఇస్తారు
మహిళలు నాటు వేస్తారు
పాటలెన్నొ పాడుకుంటు
పరవశించియు పోతారు
144
వంచిన నడుము ఎత్తరు
నాల్గు రిక్కలు పడుతరు
మునుము పట్టు కుంటను
పొలము లోన నాటెదరు
145
పొద్దు గూట్లె పడుతది
కూలి చేతికొస్తది
సంబురంగ ఇంటికి
మహిళ చేరుకుంటది
ఉగాది పండుగ మణిపూసలు
146
వికారి వెళ్ళిపోయింది
శార్వరి మనకు వచ్చింది
పండుగ నేమొ లేకుండ
కరోన వచ్చి చేరింది
147
కోకిలమ్మ కూత లేదు
మావి చెట్టు కాత లేదు
పండుగను కరోనా
జరుపుకో నివ్వనెలేదు
148
లాకు డౌను చేసినారు
ఇంట్లో ఉండమన్నారు
ఇంట్ల ఉన్న వస్తువులతొ
ఉగాదిజరుప మన్నారు
149
దేవుడికి మొక్కినాము
టెంకాయలు కొట్టినము
పచ్చడిని తాగినంక
భక్ష్యాలను తిన్నాము
150
మాస్కులను ధరించినము
ఇంటిలోనే యున్నాము
టీవీ వార్తలనుజూస్తు
జాగ్రత్తగ ఉన్నాము.
మక్క కంకులపై మణిపూస లు
151
మక్క చేనుకు పోయాము
మక్క కంకులు విరిశాము
విరిచి వాటి నన్నిటిని
సంచులల్లో నింపాడు
152
ఇంటికి తీసుకొచ్చాము
వాటి బూరును తీశాము
పొయ్యిల మంట మండించి
కంకులు కాల్చు కున్నాము
153
పొయ్యిల నుండి తీశాము
నిమ్మ, ఉప్పు రాశాము
నోట్లొ ఊరిల్లు ఊరగ
కడుపు నిండా తిన్నాము
154
కూలీలను పిలిచాము
చేనునంత కోశాము
బండమీద ఎండబోసి
బూరు నంతా తీశాము
155
కంకులమిషను వచ్చింది
కంకుల నన్ని పట్టింది
బస్తాలల్లో నింపాక
జోరున వాన కురిసింది
156
ఎండకు ఎండ బెట్టాము
ట్రాక్టరు తీసు కొచ్చాము
సిద్దిపేటకు తీసుక వెళ్ళి
అమ్మి డబ్బులు తెచ్చాము
పాప ఊయల మణిపూసలు
157.
అమ్మ మేలు కొన్నది
పనులు చేస్తు ఉన్నది
అమ్మ తోటి పాప లేచి
ఆడుకుంటు ఉన్నది
158
పాలబువ్వ కలిపింది
పాపకుతిన పెట్టింది
కడుపునిండ తిన్నాక
పాపకు నిద్ర వచ్చింది
159
అమ్మ చీర తెచ్చింది
దూలానికి కట్టింది
పాప నందులో వేయగ
గాఢ నిద్ర పోయింది
160
అమ్మ పనికి వెళ్ళింది
వరి కోత కోసింది
మధ్యాహ్నం వచ్చియు
పాప కన్నం పెట్టింది
161
తిరిగి పనికి పోయింది
కుప్పలన్ని మోసింది
కళ్ళంల పెట్టి వచ్చి
రాత్రి ఇంటికొచ్చింది
162
అన్నము కూర వండింది
అందరికినే పెట్టింది
పాపకు పాలు పట్టి
తాను నిద్రను పోయింది.
కరోనా జాగ్రత్తలు మణిపూసలు
163
ఊరందరును కలిశారు
ఐకమత్యము చాటారు
కరోనాను తరిమి కొట్ట
జాగ్రత్తలు వహించారు
164
ఇంటి బయటకెళ్ళము
ఇంటిలోనే ఉంటము
లాకుడౌను అందరును
పాటించి తీరుతాము
165
ఇంటి బయటకందరము
గుంపులుగాను వెళ్ళము
చిన్న చిన్న పనులుంటె
ఒక్కొక్కరు వెళ్ళెదము
166
సర్పంచును కలిసారు
మీటింగును పెట్టారు
కొత్త వారినెవ్వరిని
ఊరికి వద్దన్నారు
167
బస్సులు రావట్లేదు
జనులే పోవట్లేదు
కష్టమెంత ఐనను
పనులే ఆగుటలేదు
దేవుళ్ళ పై మణిపూసలు
168
ముక్కంటి దేవుడివా
త్రిశూలమును బట్టవా
దానితోటి కరోనాను
పోయెటట్టు చూడవా
169
వెంకటేశ్వర స్వామి
నీ కొండకు వస్తిమి
అందరిని కరోన నుండి
కాపాడయ్య స్వామి
170
బృందావన కృష్ణయ్య
మమ్ముల కాపాడయ్య
మహమ్మారి కరోనతో
మరణాలు ఎక్కువయ్య
171
అయోధ్యా రాముడతడు
ప్రజలందరికి దేవుడు
చేతిలోని బాణముచే
కరోనను చంపుతాడు
172
దేవుళ్ళంత వస్తరు
కరోనా పని పడతరు
దేశమంత క్షేమంగ
ఉండేటట్లు చేస్తరు
బాలకార్మికుల కష్టాలు
173
అమ్మ నాన్న ఉన్నారు
పనికి వెళ్ళుతున్నారు
కూడు సరిపోదని
పిల్లలు వెళ్ళు చున్నరు
174
ఇటుక బట్టి వెళ్తున్నరు
ఇటుకలను మోస్తున్నారు
వచ్చేటి డబ్బుతో
జీవనము గడుపుతున్నరు
175
పాప ఇటుకలుమోసెను
శక్తి అంతాతగ్గెను
ఆహారమెంతతిన్న
ఎదుగ లేకపోయెను
176
బడులకు పంపించాలి
పిల్లల చదివించాలి
పనులకు వెళ్ళకుండా
ప్రజలే గుర్తించాలి
177
బాల్య మందు బాలలు
ఆడవలెను ఆటలు
రెక్కబొక్కముదురాలి
బడికి పంపించాలి
178
పెద్దలు పనికి పోవాలి
డబ్బు సంపాదించాలి
కన్న పిల్లలందరినీ
ఆరోగ్యంగ ఉంచాలి
179
బడికి వచ్చె పిల్లలు
వికసించిన మల్లెలు
ప్రభుత్వం పిల్లలకు
ఇవ్వవలెను బుక్కులు
180
పనికి తీసుకు వెళ్ళొద్దు
జైలుపాలును కావద్దు
చిన్నపిల్లలందరిని
ఇంటివద్దే నుంచొద్దు
181
అంగను వాడి తోలాలి
గుడ్లు పాలను ఇవ్వాలి
కమ్మని కథలు నేర్పాక
చిన్న బడికిని పోవాలి
ఋషి తపస్సు మణిపూస లు
182
రుషి ధ్యానము చేస్తున్నడు
రాజు అక్కడికొచ్చాడు
నాకు దాహ వేస్తోందని
నీళ్లివ్వుమని యడిగాడు
183
రుషి నీళ్లను ఇవ్వలేదు
మాట పలుకు అసలు లేదు
ఇంత పొగరుబోతుయని
రాజు కేమొ తెలియలేదు
184
అక్క డిక్కడచూచెను
చచ్చిపోయిన పామును
తీసుకు వచ్చి రాజేమొ
ముని మెడలోన వేసిను
185
ఋషి కొడుకే వచ్చాడు
తన తండ్రిని చూశాడు
తండ్రి మెడలో పామున్నది
ఎక్కడిదని యడిగాడు
186
అపుడు శిష్యులందరు
కథ నంత చెప్పారు
ఉగ్రుడైన కొడుకేమొ
రాజును శపిస్తారు.
కష్టించే రైతు మణిపూస లు
187.
ఎద్దులాను తెచ్చాడు
నాగలికి కట్టాడు
పొలము అంతా దున్ని
నాట్లేయ దలిచాడు
188
పొలము నాట్లు వేసెను
రోజు నీళ్లు పెట్టెను
పైరంతా పెరిగాక
గడ్డి బాగ యుండెను
189
కూలీలను తెచ్చెను
గడ్డిని కలిపించెను
రైతు చేతపార బట్టి
ఒరము చెక్కు చుండెను
190
గడ్డి యంత నేరెను
ఒక్క దగ్గరేసెను
తాడుతో మోపు గట్టి
ఇంటికి తీసుకెళ్లెను
191
బర్రె ముందు వేశాడు
గడ్డంత మేపాడు
పొద్దుగాల లేసినంక
పాలన్నీ పిండాడు
192
ఎండ వానకు ఉంటాడు
పొలమున పని చేస్తడు
తన కోసమే కాకుండ
ప్రజలకు మేలు కోరుతాడు
193
అలసట లేదంటాడు
పని చేస్తూనె ఉంటాడు
రైతేను మనందరికి
నిజమైన భగవంతుడు
మక్క జొన్న గటుక
194.
మక్క కంకులు తెచ్చాము
గింజలన్నియు వలిశాము
గ్రైండరులోన వేసియు
రవ్వ లాగ చేసినాము
195
నీళ్లు రవ్వల కలిపాను
గిన్నెలో ఉడక పెట్టాను
సల్ల గలిపితిను చుండ
ప్రాణము చల్ల గుండును
196
పూర్వము గట్కతిన్నారు
ఆరోగ్యంగా ఉన్నారు
ఒంటికి జబ్బులు రాకుండ
చాలకాలము బతికారు
197
గటుక తినడము మరిచారు
బలము లేకుండున్నారు
సారములేని యన్నమును
ప్రజలంత తిను చున్నారు.
198
గటుకల ఐరను ఉన్నది
శక్తినిచ్చు చున్నాది
ఇప్పటి జనులంతను
గటుక తింటెను మంచిది.
కందిలిపై మణిపూస లు
199
చీకట్లో వెళ్ళిన
కందిలేను యుండిన
పాము తేళ్ళ నుండియు
ప్రాణానికి రక్షన
200
కందిల వెళ్ళిపోయెను
కరెంట్ బల్బు లొచ్చెను
ఎక్కువ వెలుగు లివ్వగ
కండ్లుగుడ్డి గాయెను
201
గ్యాసు నూనెను పోశారు
వత్తితో వెలిగించారు
కాంతి ఎక్కవరాగ
చదువులన్నో చదివారు.
202
కందిలి అటు కెక్కెను
తుప్పే పట్టి పోయెను
ఇప్పటి తరానికేమొ
తెలియకుండా పోయెను
ఇడ్లీ మణిపూస లు
203
ఇడ్లీ రవ్వను తెస్తారు
గిన్నెల నానబెడతారు
ఇడ్లీ కుక్కర్లేసి
ఉడికి నంకను తీస్తారు
204
పల్లి చట్ని చేస్తారు
అల్లం చట్ని చేస్తారు
ఇడ్లీ కలిపి తినుచుండ
ఇబ్బంది రాదంటారు
205
పొద్దున ఇడ్లితినాలి
ఆరోగ్యంగా ఉండాలి
సులభంగ జీర్ణమౌను
అందరును గ్రహించాలి.
కరోనా మణిపూసలు
206
కరోనా వచ్చింది
భారతుకు చేరింది
అప్రమత్తమవ్వాలని
చాటింపు వేసింది
207.
ప్రధాని మోడి గారు
లాకు డౌను చేశారు
బయటకంత వెళ్ళకుండ
ఇంట్లుండమన్నారు
208
ఊహానులో పుట్టెను
ఊహానులో పెరిగెను
అక్కడి జనులందరిని
అంతము చేయుచుండెను.
209
అన్ని దేశాలెల్తుంది
ఆగమాగము చేస్తుంది
దేశదిమ్మరి లాగ
ప్రజలనంటి తిరుగుతుంది.
210
మందు లేదు మాకు లేదు
అంటుకుంటెను పోలేదు
ఇంట్లోని అందరిని
చంపకుండను పోలేదు
211
ఇంట్లోనే ఉండాలి
రాకుండా చూడాలి
నివారణ ఒక్కటే
మార్గమంటు చెప్పాలి
212
బజార్లెంట తిరుగొద్దు
షేకు హ్యాండు లివ్వొద్దు
మనిషి మనిషికి దూరమం
పాటించుట మరువద్దు
213
దేశమంత తిరుగుతుంది
పల్లె పల్లె తిరుగుతుంది
వాడవాడలు తిరిగియు
మన ఇంటికే వస్తుంది
214
డాక్టర్లె లేకుంటెను
పోలీసు లేకుంటెను
కరోనా కేసులే
కుప్పలై పోయేను
215
సభలెక్కడ పెట్టొద్దు
ప్రజలు గుమిగూడవద్దు
పరిశుభ్రత పాటించి
మన హద్దులు దాటొద్దు.
శ్రీ రాముని కళ్యాణం
216
దశరథుడు రాజుగారు
సంతానము లేని వారు
యజ్ఞాలు చేయ గాను
సంతానము నిచ్చెవారు
217
కొడుకులు నలుగురు బుట్టెను
తొట్టెల వారిని వేసెను
అంగరంగ వైభవంగ
నామకరనణే చేసెను
218
రాముడేను పెద్దవాడు
లక్ష్మణుడు రెండొ వాడు
భరతుడును శత్రుఘ్నుడు
వీరికేను తెలివి మెండు
219
గురువు వద్దకెళ్ళారు
విలువిద్యలు నేర్చారు
రాక్షసులను చంపుటకు
కౌశికునితొ వెళ్లారు
220
తాటకిని చూశారు
బాణ మెక్కుపెట్టారు
చీకటి పడకముందె
నేల కూల్చి వెళ్లారు
221
ఆ కౌశికుని యాగము
కాపాడుటె ధర్మము
అనుచు అన్నదమ్ములు
యోచించిరి మొత్తము
222
మారీచ సుబాహులు
వేసె మాంస ముద్దలు
రామ లక్ష్మణులు చూసి
చంప కురిసే విరులు
223
మిథిల నగర మేగెను
జనకుడు ఏ తెంచెను
కుశల వార్త లడిగియు
ధనువును తెప్పించెను
224
రాముడు చేబూనెను
శివ ధనువును విరిసెను
జనకుడు సీతను తెచ్చి
రాముకుపెళ్లి చేసెను
225
లక్ష్మణుడు ఊర్మిళయును
భరతునికే మాండవిను
శత్రఘ్నునికి శృత కీర్తి
ఇచ్చి పెళ్లిళ్లు జేసెను
226.
అడుగు బయట పెట్టకండి
ఇంటిలోన వుండండి
కరోనా మహమ్మారి
లేకుండానె చూడండి
కూలి తల్లి మణిపూస లు
227.
తట్ట నెత్తిపై పెట్టెను
కొడవలి నడుముకు చెక్కెను
పనిముట్లు ఎత్తుకొని
పొలము పనులకే వెళ్ళెను
228
గడ్డపార పట్టింది
గడ్డలన్ని తవ్వింది
పారచేత బట్టుకొని
తట్ట లెత్తి పోసింది
229
పొలములోనచల్లింది
నీళ్ళు నిండ బెట్టింది
మధ్యాహ్నము కాగానే
సద్ది అన్నము తిన్నది
230
గొడ్డలి చేత పట్టింది
చెట్టుకొమ్మలు నరికింది
తాడు కిందన పరిచియు
కట్టెలమోపు గట్టింది
231
మహిళలంత మంచివారు
పనుల నెన్నో చేశారు
మహిళలార మీకివే
మా యందరి వందనాలు
సీత పర్ణశాల మణి పూసలు
232
మాయలేడి వచ్చెను
ఇంటి చుట్టు తిరిగాను
సీతమ్మ దాన్ని చూసి
కావాలని కోరిను
233
రాముడు వద్దన్నాడు
సీత పట్టే బట్టెను
చివరికిరాముడేమొ
లేడిపట్టుట వెళ్ళెను
234
మాయలేడి చచ్చెను
సీత పేరు పిలిచెను
సీతమ్మ మరిదినేమొ
అడవికి వెళ్ళు మనెను
235
లక్ష్మణు గీత గీశాడు
వదిన దాటకు అన్నాడు
లక్ష్మణుడే రాముడిని
వెతకడానికి వెళ్లాడు
236
లంక నుండియు రావణుడు
పర్ణశాలకు వచ్చాడు
సన్యాసి వేషమేసుక
సీత దగ్గరికొచ్చాడు
237
సీత ఇంట్లో ఉండెను
రావణుడే పిలిచెను
బిక్షాన్ని వేయుమని
అతడు సీత నడిగెను
238
భిక్ష తీసుకొచ్చెను
గీత బయటకెళ్లెను
అప్పుడే రావణుడు
సీత నెత్తు కెళ్ళెను
కమ్మరి వాళ్ళ కష్టాలు
239
వర్షాకాలమొచ్చేను
చెరువులన్నియు నిండెను
నాగలి రైతు తీసుకొని
కమ్మరి దగ్గరికెళ్ళెను
240
బాశడితో చెక్కాడు
నాగలి నే చేశాడు
కర్రు కొలిమిలో కాల్చి
నాగలికే అతికాడు
241
రైతుకు నాగలిచ్చాడు
దాన్ని తీసుక వెళ్ళాడు
ఎడ్లు గట్టి పొలము దున్ని
పంట నందు లో వేసాడు
242
పంటలు బాగ పండెను
లాభాలెన్నో వచ్చెను
కమ్మరికి కూలి కింద
కొంతధాన్య మిచ్చెను
243
ట్రాక్టర్లు చాల వచ్చెను
కమ్మరి పనియే పోయెను
కూలి నాలి చేసుకుంటు
బ్రతుకునే గడుపు చుండెను
చిన్ని కృష్ణుడు మణిపూస లు
244
యశోదమ్మా తనుజుడు
కొంటె పనులు చేశాడు
అల్లరెంతొ చేయును
ఆయనే గోపాలుడు
245
వెన్న దొంగిలిస్తావు
అల్లరెంతొ చేస్తావు
యశోదమ్మ ప్రియమైన
ముద్దుల గోపాలుడవు
246
కొంటె పనులు చేస్తాడు
కొంగులు ముడు లేస్తాడు
వెంటబడి వస్తేను
మాయలు చేస్తుంటావు
247
గోపికలే వచ్చారు
అమ్మ తోటి చెప్పారు
రోలుకేసి బంధించగ
భామలెంతొ మురిశారు
248
కృష్ణుడు మన్నుతినెను
అమ్మ నేమొ చూసెను
నోరు తెరువుమనియనగ
లోకమంత చూపెను.
గంగాళం మణిపూస లు
249
గంగాళము నేడును
కానరాదెక్కడను
పాతబడి మూలకు
చిలుము బట్టి పోయెను
250
డ్రమ్ములెన్నొ వచ్చెను
గంగాలము పోయెను
కంటికి చూద్దామన్న
కానరాక యుండెను
251
బంధువులంత వచ్చెదరు
గచ్చు కాడికి పోయెదరు
చెంబునిండ నీరు దీసి
కాళ్లు చేతులు కడిగెదరు
లహరిమణిపూస లు
252
పెద్దకోడలు వచ్చింది
పిండిని తాను కలిపింది
కొబ్బరి పూర్ణము పెట్టి
అత్తకు అందిఇచ్చింది
253
అత్త నూనెలో కాల్చింది
జల్లి గంటె తీసింది
గరిజలన్ని దేవుచు
పెద్ద గిన్నెలో వేసింది
254
చిన్న కోడలు నిలుచుంది
వారి వంకన చూసింది
భవిష్యత్తులో నేను
ఇలా చేయాలనుకుంది
255
పిల్లలు కూర్చున్నారు
వాటిని చూస్తున్నారు
నాయనమ్మ నేమో
ఇస్తదని చూస్తున్నరు
256.
నాన్నగారు వచ్చారు
అందరు కూర్చున్నారు
నానమ్మ గరిజలను
సమానంగా పంచారు.
ప్రపంచ పటము మణిపూసలు
257
బడులకు సెలవు లిచ్చారు
ఇంటిపట్టున ఉన్నారు
బయటకి వెళ్లి ఆడితె
కరోనా వస్తుందన్నరు
258
పిల్లలు అంత కలిసారు
రంగు డబ్బా తీశారు
గోడకునిచ్చెనేసుకొని
ప్రపంచ పటము గీశారు
259
రంగులనన్ని తెచ్చారు
బ్రష్షు నందులో ముంచారు
బొమ్మకు రంగులు వేసియు
బాలలందరు మురిశారు
మేదరి మణిపూసలు
260
మేదరి యడవికి కెళ్ళాడు
వెళ్తా చెట్లు చూశాడు
వాటినన్నినరికి వేసి
ఇంటికి తీసుకొచ్చాడు
261
ఎండలొ ఎండ పెట్టాడు
మధ్యల కన్నిచీరాడు
సన్న పుల్లలు తీసుకొని
బుట్టల నెన్నొ అల్లాడు
262.
బుట్టలంత రించెను
ప్లాస్టిక్ గంప లొచ్చెను
మేదరి బతుకు కష్టమై
కూలికెళ్ళుచు నుండెను
రోళ్ళు అమ్మేవారిపై మణిపూసలు
263
గుట్ట మీదికి పోయారు
మంచి బండను చూశారు
సుత్తెతో పగులగొట్టి
ఇంటికి తీసుకొచ్చారు
264
ఇంటి బయటకు వచ్చారు
బండనుపగుల కొట్టారు
రోలు,రోకలి చేసుకొని
విసురురాయిని చేశారు.
265
బండ్ల మీద పెట్టారు
వీధులన్ని తిరిగారు
చెమటలన్ని కారంగా
వాటినమ్ముకొచ్చారు
266
రోలు మూలకు పడెను
విసురురాయి పగిలెను
మిక్సీలకు ప్రజలంతా
అలవాటై పోయెను
267
కూలీలకు పని లేక
వేరే పని చేయలేక
ఆగమాయె బతుకులు
సంసారము ఈదలేక.
విస్తర్లపై మణిపూస లు
268
అడవికిమేము వెళ్ళాము
మోదుగు చెట్లను చూసాము
దాని ఆకులు తెంపుకొని
తిరిగి ఇంటికి వచ్చాము
269
దారానికి కుచ్చారు
వాటిని ఎండబెట్టారు
నీళ్లలోన నానబెట్టి
ఆకులు అనగ పెట్టారు
270.
సొప్పపుల్లలు తెచ్చారు
ఇస్తరాకులు కుట్టారు
వేసవి కాలం రాగానే
వాటినిఅమ్మి వేశారు
271
పెళ్లిళ్లు బాగ జరిగెను
విస్తారుకట్ట లమ్మెను
కానీ ఇప్పుడుఅవన్ని
దొరుకుట కష్టము నాయెను
272
ప్లాస్టిక్ ఆకులు వచ్చెను
ఆకు విస్తర్లు పోయెను
ప్రజలందరు వాటికే
అలవాటు చెంది పోయెను
పూస వేర్ల తల్లి మణిపూసలు
273
బస్తీకిని వెళ్తారు
బొమ్మలన్ని తెస్తారు
ఇంటికి వచ్చినంక
గంపలో పేర్చుతారు
274
పొద్దునే లేస్తారు
సామాను సర్దుతారు
గంప నెత్తిన పెట్టుకొని
ఊరంత తిరుగుతారు
275
ఎండలోనమండుతారు
వానలోన తడుస్తారు
చిన్న పాప సంకన
ఎత్తుకొని తిరుగుతారు
276
గంప బరువు మోస్తారు
పాపబరువు అనుకోరు
పొట్ట చేత పట్టుకోని
చాల కష్టపడుతారు
277
ప్రభుత సాయము చేయాలి
వారి కష్టము తీర్చాలి
పేద వారినాదుకొని
ఉపాధిని కల్పించాలి.
289
అంగను బడికి పోతాను
ఆటలన్ని ఆడుతాను
ఉడకబెట్టిన గుడ్డు
అన్నము లోన తింటాను
290
ఇంటి లోనను ఉండను
బడిలోన ఆడుతాను
బడిఉంటెను మనకు
ఇల్లునే మరిపించును
291
గణపతికాళ్ళుమొక్కాను
కొబ్బరికాయ కొట్టాను
కరోన వెళ్ళిపోగానె
బయట నేను ఆడుతాను.
292
లాకు డౌను పోవాలి
మళ్ళిబడినె తెరువాలి
బడిలోనె అందరము
మంచి చదువులు చదవాలి
అమ్మవారి పూజ మణిపూసలు
293
సోమవారం వచ్చింది
అమ్మ గుడికిని వెళ్ళింది
కొబ్బరికాయ,పూలను
వెంట తీసుక పోయింది.
294
అమ్మవారిని కడిగింది
మంచిగబొట్లు పెట్టింది
పూలదండను వేసి
కొబ్బరికాయ కొట్టింది
295
నైవేద్యమును పెట్టింది
శ్రద్ధ తోడను మొక్కింది
కరోన మహమారిపోయి
అందరు బాగుండాలంది
296
కొబ్బరి వక్కను తీసింది
బిడ్డకు కొంచెము ఇచ్చింది
మిగిలిందిసంచిలేసి
ఇంటికి తీసు కెళ్ళింది
గోపిక పై మణిపూసలు
297
గోపిక వచ్చి కూర్చుంది
కుండలొ పెరుగు పోసింది
అందులో కవ్వమేసి
పెరుగే చిలుకుతుఉన్నది
298
పెరుగులోవెన్న దీసెను
కడవలోనికే ఎత్తెను
ఉట్టి మీద పెట్టగానె
కృష్ణుడే వచ్చిచూసెను
299
గోపిక బయటకు వెళ్లెను
కృష్ణుడు ఇంట్లకు వచ్చెను
వెన్న అందకపోయిన
పీట వేసుకుని తీసెను
300
కృష్ణుడుకొంత తినెను
కొంతపారబోసెను
గోపికమ్మవచ్చి చూసి
యశోదకే చెప్పెను
11 comments:
అమ్మాయి గట్టి ప్రయత్నం చేసి మంచి మణిపూసలు రాసింది. అమ్మాయికి మంచి సాహిత్య భవిష్యత్తు ఉన్నది. వెరీగుడ్ లహరి. ప్రోత్సహించిన లక్ష్మయ్య సార్ ధన్యుడవు. 🙏👍
Replyపొట్టోల్ల లహరి 9వ తరగతి ZPHS గుఱ్ఱాలగొంది రాసిన మణిపూసలను చక్కని చిత్రాలతో డిజైన్ చేసిన గోగులపాటికృష్ణమోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు
Reply
వరుకోలు లక్ష్మయ్య సిద్దిపేటలహరి మణిపూసలు బాగా రాసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను
Replyకొంత మంది కవులకు బిరుదులు రాగానే సన్మాములు కాగానే ఒక ఫోటో వస్తే చాలనుకొని ఆ కవితా ప్రక్రియ ను ఆపేసి ఇంకో దానికై పరుగు .కాని చిన్న అమ్మాయైన పొట్టోల్ల లహరిని చూసి నేర్చుకోవలసినదెంతో వుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న మణిపూసల బాల కవిభూషణ బిరుదు పొందిన చిన్నారి ఎంతో స్ఫూర్తిదాయకంగా తన కలాన్ని ఆపకుండా రాయడం మణిపూసల గ్రూపులో హర్షించిదగిన ప్రత్యేకం ఎంతో ఆనందదాయకం. చిన్నారికి హార్దిక శుభాకాంక్షలతో అభినందిస్తున్నాను. అమ్మాయిని ప్రోత్సహించిన వరుకోలు లక్ష్మయ్య గురువుగారికి అభినందనలు మరియు యూట్యూబ్ లో రూపకర్త శ్రీ గోగులపాటి కృష్ణ మోహన్ గారికి ప్రత్యేక అభినందనలు.........వేముల శ్రీ చరణ్ సాయిదాస్. సిద్దిపేట.
Replyనిజంగా సార్ ఇలాంటి విద్యార్థినిలు ఉంటే గురువులకు ఇంతకన్నా ఆనందం ఏముంటుంది
Reply
లహరి గుడ్ లక్ మంచి భవిష్యత్ ఉందమ్మా నీకు








































భాను ప్రకాశ్ ఎల్లుండి యూట్యూబ్ చేసి గ్రూప్ లో పెడుతుండు.వినగలవు.
Comments
Post a Comment