నలవోలు నర్సింహా రెడ్డి పద్యాలు
........ పొడుపు పద్యము ........
ఆ. పొగడ చెట్టు కేది పోల్చి చెప్పెడు పేరు..?
మోద మలరు పేరు మొగ్గ కేది ..?
అద్దమునకు నొండు ముద్దైన పేరేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 540
జవాబు … ?
(నిన్నటి జవాబు .. సత్తా)
[05/02, 6:22 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
నిద్ర తీరి పోవ నెలకొనునది యేది..?
వర్తనమున కేది వరలు పలుకు
సరసమైన మాట జాగరూకతకేది
మూట నొక్క మాట ముద్దు బాల..! 541
జవాబు … ?
(నిన్నటి జవాబు .. ముకురము, ముకురం)
[06/02, 6:50 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. ఏది పోనీ ధైర్య మిలను వీరున కుండు ..?
కాల్తు రెట్టి జొన్న కండె దినగ..?
చిన్ని చెట్టు కేది చెన్నుమీరెడు పేరు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 542
జవాబు … ?
(నిన్నటి జవాబు .. మెలకువ)
[07/02, 6:17 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. మాట వినని మూర్ఖ మనుజు నే మని యండ్రు..?
తెగని కత్తి నెటుల తెలుపవచ్చు..?
శిఖలు నరకి వేయ చెట్టు లెట్టుల దోచు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 543
జవాబు … ?
(నిన్నటి జవాబు .. మొక్క)
[08/02, 6:19 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. అరయఁగ నెఱిగించు మననేది వివరించ..?
ధవళ వర్ణ మనగ తనరు నేది..?
స్వచ్ఛ మైన దనుచు చాటి చెప్పగ నేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 544
జవాబు … ?
(నిన్నటి జవాబు .. మొండి)
[08/02, 10:23 pm] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
చతుర్విధ పురుషార్థములపై సీసము
సీ. భువిని చతుర్విధ పురుషార్థముల నెంచి
మనుజుండు సతతమ్ము మసల వలయు
నిర్మలంబై నట్టి ధర్మంబు పాటించి
తన్మార్గ దృక్కు లన్దప్ప కుండ
నర్థంబు సమకూర్చి యర్థ వంతంబైన
సంచయమ్మును బొంది సరసముగను
వలయు కోరిక లెల్ల తలపులో చెలరేగ
నవ్వాని తీర్చుచు హాయి గొల్ప
గీ. హద్దు లెరుగుచు బ్రతుకులో ముద్దుగాను
సత్యమును తప్పకుండగ సాగు వారు
యెట్టి యొడుదుడుకులు లేక నింపు తోడ
మోదమలరగ బొందేరు మోక్ష పథము
[08/02, 10:36 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
చతుర్విధ పురుషార్థములపై సీసము
సీ. భువిని చతుర్విధ పురుషార్థముల నెంచి
మనుజుండు సతతమ్ము మసల వలయు
నిర్మలంబై నట్టి ధర్మంబు పాటించి
తన్మార్గ దృక్కు లన్దప్ప కుండ
నర్థంబు సమకూర్చి యర్థ వంతంబైన
సంచయమ్మును బొంది సరసముగను
వలయు కోరిక లెల్ల తలపులో చెలరేగ
నవ్వాని తీర్చుచు హాయి గొల్ప
గీ. హద్దు లెరుగుచు బ్రతుకులో ముద్దుగాను
సత్యమును తప్పకుండగ సాగు వారు
యెట్టి యొడుదుడుకులు లేక నింపు తోడ
మోదమలరగ బొందేరు మోక్ష పథము
[08/02, 10:36 pm] Narsimhareddypavani: ........ అల్లసాని పెద్దన ఉత్పల మాలిక .......
పూఁత మెఱుంగులుం బసరు పూఁప బెడంగులుఁ జూపు నట్టివా
కైతలు? జగ్గు నిగ్గు, నెనగావలెఁ గమ్మన గమ్మనన్వలెన్
రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలియారజంపు ని
ద్దా తరి తీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్
బాఁతిగఁ బైకొనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ
కూఁత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్
జేతి కొలందిఁ గౌఁగిటను జేర్చిన కన్నియ చిన్నిపొన్ని మే
ల్మూఁతల చన్నుదోయివలె ముచ్చట గావలెఁ బట్టి జూచినన్
డాతొడ నున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనౌ
వాతెఱ దొండపండువలె వాచవి గావలెఁ బంట నూదినన్
గాతలఁ దమ్మిచూలి దొర కైవసపుం జవరాలి సిబ్బెపు
న్మే తెలి యబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బ పొం
బూఁతల నున్న కాయసరి పోడిమి కిన్నెర మెట్లబంతి సం
గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడ గౌళవంతుకా
సాతత తాన తానల పసన్ దివుటాడెడు గోటమీటు బల్
మ్రోఁతలునుం బలెన్ హరువు మొల్లము గావలె నచ్చతెన్గు లీ
రీతిగ, సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీ వధూ
టీ తపనీయ గర్భ నికటీభవ దానన పర్వసాహితీ
భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభా
శీత నగాత్మజా గిరిశ శేఖర శీత మయూఖ రేఖికా
పాత సుధాప్రపూర బహుభంగ ఘుమంఘుమ ఘుంఘుమార్భటీ
జాతక తాళయుగ్మ లయ సంగతి చుంచు విపంచికా మృదం
గాతత తేహితత్త హిత హాధిత ధంధణు ధాణు ధింధిమి
వ్రాత నయానుకూల పదవార కుహూద్వహ హారి కింకిణీ
నూతన ఘల్ఘలా చరణ నూపుర ఝూళ ఝుళీమరంద సం
ఘాత వియద్ధునీ చకచక ద్వికచోత్పల సార సంగ్రహా
యాత కుమారగంధవహ హారి సుగంధ విలాస యుక్తమై
చేతము చల్లఁజేయవలె జిల్లనఁ జల్లవలెన్ మనోహర
ద్యోతక గోస్తనీ ఫలమధుద్రవ గోఘృత పాయస ప్రసా
రాతి రసప్రసార రుచిర ప్రసరంబుగ సారె సారెకున్.
[08/02, 10:36 pm] Narsimhareddypavani: పూఁత మెఱుంగులుం బసరు పూఁప బెడంగులుఁ జూపు నట్టివా
కైతలు? జగ్గు నిగ్గు, నెనగావలెఁ గమ్మన గమ్మనన్వలెన్
రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలియారజంపు ని
ద్దా తరి తీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్
వట్టి తళుకులు . లేత మొగ్గల అందాలు చూపునట్టివాఁ కవితలు? తళతళలతో అందాల కాంతులతో
కవితలోని పదాలు, భావాలు సమానం కావాలి ఆ కవితలు చదువుతుంటే లేదా వింటుంటే ఎదో తెలియని
కమ్మనైన పరిమళము మనసంతా వ్యాపించాలి. లోలోపల తలచుకొని మురిసిపోయే రీతిగా ఆ కవితలు ఉండాలి. విలాసాలతో, మధురమైన హావ భావ ధ్వనులతో కోరుకొన్న ప్రేయసి చేష్టలు మనస్సుకు యెంత
దగ్గరగా వచ్చి రేయనక పగలనక తలచు కొని యెంత మురిసిపోతామో, ఒక మంచి కవిత చదువుతే కూడా అంతగా మనస్సు మురిసి పోవాలి.
బాఁతిగఁ బైకొనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ
కూఁత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్
జేతి కొలందిఁ గౌఁగిటను జేర్చిన కన్నియ చిన్నిపొన్ని మే
ల్మూఁతల చన్నుదోయివలె ముచ్చట గావలెఁ బట్టి జూచినన్
నచ్చిన అందెగత్తె కంఠము లోనుంచి వచ్చే మాటలు, పావురాయి పలుకుల వలె వినిపించి మనస్సుని
ఎలా గిలిగింతలు రేపి అనంత మైన కోరికలు రేకెత్తింప జేస్తాయో అందమైన కవితలు అటువంటి అనుభూతిని
కలిగింప జేయాలి. ప్రేమతో ప్రియ ప్రేయసిని కౌగిలించు కొన్నప్పుడు ఆమె యవ్వన సంపదను స్ప్రుశించినప్పుడు శరీరానికి కలిగే ఆ స్పర్శానుభూతి మనస్సులో రేపు పులకింతలవలె మంచి కవితలు చదివినప్పుడు కూడా అలా కలగాలి.
డాతొడ నున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనౌ
వాతెఱ దొండపండువలె వాచవి గావలెఁ బంట నూదినన్
తమ ఎడమాంకము మీద కూర్చున్న విలాసవతి యగు ముద్దు లొలుకెడు ప్రియురాలిని ముని పంట నొక్కినప్పుడు ఆమెయొక్క దొండ పండువంటి అదరములనుండి జాలువారు అమృత ధారలవలే, కవితా మధు ధారలు కూడా అటువంటి రసానందము కలిగించాలి.
గాతలఁ దమ్మిచూలి దొర కైవసపుం జవరాలి సిబ్బెపు
న్మే తెలి యబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బ పొం
బూఁతల నున్న కాయసరి పోడిమి .................................
బ్రహ్మ దేవుని ఇల్లాలైనా సరస్వతీ దేవి యొక్క దేహ కాంతికి సమానముగా కవిత్వ ముండాలి. ఆమె యొక్క అందమైన రూప, యవ్వన సంపదల రాపిడిలచే బ్రహ్మ చేతులలో ఏర్పడిన కాయల వలె కవిత్వం శోభించాలి. (ఒక వస్తువును పదే పదే చేతితో రాపిడి చేస్తే ఆ చేతికి కాయలు కాస్తాయి. ఆ కాయ బంగారపు పూతవలె వున్నదని కవి చమత్కారము.. కాయను కిణము అని కూడా అంటారు )
..................................... కిన్నెర మెట్లబంతి సం
గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడ గౌళ పంతుకా
సాతత తాన తానల పసన్ దివుటాడెడు గోటమీటు బల్
మ్రోఁతలునుం బలెన్ హరువు మొల్లము గావలె నచ్చతెన్గు లీ
రీతిగ, ……………………………………………………………….
వీణ వాయించేటప్పుడు (కుడిచేతితో తీగలు మీటుతూ, ఎడుమ చేతి వ్రేళ్లతో మెట్లమీద అదిమిపట్టి,
స్వరాలు పలికిస్తూ వుంటారు) అటువంటి కిన్నెర వీణను గోటితో మీటేటప్పుడు వచ్చే అందమైన అనేక
రకాల శబ్దాలు ఉత్పన్నమై మనసును ఎలా గిలిగింతలు పెడుతాయో అలాగే కవిత్వంలో కూడా అనేక రకాలైన ధ్వనులు పలకాలి. మనస్సును రంజింప జేయాలి. ఈ రీతిగా కవిత్వ ముండాలని కవి అచ్చ తెలుగులో చెప్పాడు.
సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీ వధూ
టీ తపనీయ గర్భ నికటీ భవదానన పర్వసాహితీ
భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభా
సరస్వతీ దేవి బంగారు గర్భంలో పుట్టి, ముత్యాల కాంతివంటి వెలుగులో ముఖానికి ఆనందం కలిగించు వైభవంతో అలరారే నాటక సమూహాల కాంతితో, ప్రకాశించి ఆసక్తి కలిగించే భరత ముని నాట్య శాస్త్రము సమ్మతించిన రూపక లక్షణాలు ఒప్పుకొనేటట్లుగా కవిత్వం ఉండాలి. ( సరస్వతీ దేవి గర్భంలో పుట్టటమంటే ... కవిత్వం ఉత్తమోత్తమంగా ఉండాలని భావం…. చక్కనైన కవిత్వం చదువుతున్నప్పుడు వింటున్న సహృదయుల ముఖాలు ఆనందంతో వెలుగొందుతాయి. దీనినే ముఖానికి ఆనందము కలిగించు వైభవమన్నారు పెద్దన. )
శీత నగాత్మజా గిరిశ శేఖర శీత మయూఖ రేఖికా
పాత సుధాప్రపూర .........................................
హిమవంతుని కుమార్తె యైన పార్వతీ దేవితో కలిసిన పరమశివుని సిగమీద నున్న చంద్రకళ నుండి
క్రిందకు జారే అమృతపు వర్షంలా కవిత్వం పరిపూర్ణనంగా శోభించాలి. ( అనగా కవిత్వం అమృతంలా
వుండాలని భావం )
.............. బహుభంగ ఘుమంఘుమ ఘుంఘుమార్భటీ
జాతక తాళయుగ్మ లయ సంగతి చుంచు విపంచికా మృదం
గాతత తేహితత్త హిత హాధిత ధంధణు ధాణు ధింధిమి
వ్రాత నయానుకూల పదవార కుహూద్వహ హారి కింకిణీ
రౌద్ర రసములో కావ్య రచనకు ఉపయోగపడు ఒక వృత్తిని ఆర్భటి (ఆరభటి) అంటారు. ఇది ప్రౌఢంగా
ఉంటుంది. కవిత్వము అనేక రకాలైన ఘుమంఘుమ ఘుంఘుమల నుండి బయట పడు లయతాళముల
మేలికూర్పుతో ఉండాలి.
ఆ ప్రౌఢిమ ఘుమంఘుమ ఘుంఘుమ గా ఉంటుందని చెప్పటంలో ఒక చమత్కారముంది. ఈ
ఘుమంఘుమ ఘుంఘుమ కవిత్వంలో ప్రౌఢ శైలి ఎలా ఉంటుందో చెప్పకుండా చెబుతోంది. ఆ శైలిలోని
పదాలు వింటున్నా వారికి హృదయంలోకి కవితా పరిమళాలు వ్యాపించాలని కవి వాక్కు.
వీణెలోని మ్రోతలతో, తేహితత్తహిత హాధిత ధంధణు ధాణుధింధిమి మొదలగు మృదంగ ధ్వనులు
కలిసిన సమూహములకు అనుకూలంగా వుండే కోకిలల శ్రావ్యమైన మధుర ధ్వనులతో గమకితములైన
(ఉన్నతములైన) మనోహరములైన చిరుమువ్వల సవ్వడులను కవిత్వం కలిగి ఉండాలి.
నూతన ఘల్ఘలా చరణ నూపుర ఝూళ ఝుళీమరంద సం
ఘాత వియద్ధునీ చకచక ద్వికచోత్పల సార సంగ్రహా
యాత కుమారగంధవహ హారి సుగంధ విలాస యుక్తమై
చేతము చల్లఁజేయవలె జిల్లనఁ జల్లవలెన్ ....................
కొత్తవైన కాలి అందెలు ఘల్లు ఘల్లుమని మ్రోగుతుంటే, ఆ సవ్వడి మనస్సులో తీయని భావావేశం కలిగిస్తూ, మరదంపురుచిలా చక్కగా ప్రకాశిస్తాయి. అటువంటి అనుభూతి రుచులు గల్గిన ప్రేమ నల్లకలువల పూల
యొక్క పుప్పొడితో కలిసి, బూడిద రంగును పొంది, అతిశయించిన మలయమారుతపు పిల్ల గాలుల అందమైన సువాసనల విలాసములు పుట్టించి నట్లుగా కవిత్వము కూడా మనస్సులో చెప్పతరముగాని ఆనందాన్ని కలిగించాలి.
..................................................మనోహర
ద్యోతక గోస్తనీ ఫలమధుద్రవ గోఘృత పాయస ప్రసా
రాతి రసప్రసార రుచిర ప్రసరంబుగ సారె సారెకున్.
మనస్సును దోచుకొని హృదయాన్ని మురిపించే తీయనైన ద్రాక్షా ఫల రసము, తేనియ, ఆవు నెయ్యితో
వండిన పాయసము కలగలిపిన కమ్మదనము, గొప్పనైనా అతిరసమను పదార్థమునుండి వచ్చే రసం యొక్క తీయదనం గ్రోలుతూ మాటిమాటికి ఆనంద పరవశత్వం పొందు నట్లుగా, కవిత్వం విన్నప్పుడు అటువంటి అనుభూతినే పొందాలి.
( పెద్దన తన గీత మాలికలో కవిత్వం గురించి వాడిన పదాల వెనుక అంతులేని ఆలోచనా
సాగరాలు ఉన్నాయి. పూలను, వెన్నెలను, కాంతిని, మలయ మారుతాని, రుచులను, మువ్వల సవ్వడులు, మృదంగ ధ్వనులను, హృదయాంతరాళలో ప్రేమించ గలిగేవాళ్ళు మాత్రమే ఈ ఉత్పల మాలికను ఆస్వాదించ గలరు. దీనిని చదువటానికి కావలసిన అర్హత ప్రేమించగలిగే హృదయమే .......)

[08/02, 10:50 pm] Narsimhareddypavani: ఉత్పల మాలిక
దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి మెల్లమెల్లగా
డాసిన భంగి, మేలిమి కడాని వరాల కరాలు వచ్చి క
న్మూసిన భంగి, కన్నె నగుమోము పయిన్ నునుసిగ్గుమొగ్గ కై
సేసినభంగి, అందములు చిందెడి నందనవాటి వెన్నెలల్
కాసిన భంగి, జానపదకాంతలు రాట్నము మీద దారముల్
తీసిన భంగి, క్రొవ్వలపు లేఖ శకుంతల తామరాకుపై
వ్రాసిన భంగి, పెండ్లి తలఁబ్రాల్ జవరాలు రవంత నిక్కి పై
బోసిన భంగి, గుండె వడబోసిన భంగి, కళావిపంచికల్
మ్రోసిన భంగి, పొంగు వలపుల్ తలపుల్ సొలపుల్ ప్రసన్నతల్
భాసురతల్ మనోజ్ఞతలు ప్రౌఢిమముల్ రసభావముల్ గడున్
భాసిల తెల్గుకైత నవభంగుల సంగతమై, యొకింతయున్
దోసములేని శబ్దములతో, నటనం బొనరించు పాద వి
న్యాసముతో, సమంచిత గుణంబులతో, సహజమ్ములౌ యతి
ప్రాసలతో, మనోజ్ఞమగు పాకముతో, మృదుశయ్యతో, అనా
యాస సమాసయుక్తి కలశాంబుధి తీర పురోనిషణ్ణ దే
వాసుర మండలాంతర విహార వికస్వర విశ్వమోహినీ
హాసవిలాస విభ్రమకరాంచల చంచల హేమకుంభ సం
భాసి సుధాఝురీ మధురిమమ్ములు గ్రమ్ము కొనన్ వలెన్; శర
న్మాస శుచిప్రసన్న యమునాతట సైకత సాంద్రచంద్రికా
రాస కలా కలాప మధుర వ్రజ యౌవత మధ్య మాధవ
శ్రీసుషమా ప్రపూర్ణ తులసీదళ సౌరభ సారసంపదల్
రాసులు రాసులై పొరలి రావలె; పొంపిరి పోవలెన్ నవో
ల్లాస వసంత రాగ రస లాలిత బాలరసాల పల్లవ
గ్రాస కషాయకంఠ కలకంఠ వధూకల కాకలీధ్వనుల్!
[09/02, 6:16 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. అధిక మనగ నేది యరసి చెప్పగ బూన..?
వడ్డి కొండు పదము పలుక నేది..?
నిత్య భయము గొల్పు మృత్యువు నేమండ్రు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 545
జవాబు … ?
(నిన్నటి జవాబు .. తెలుపు)
[10/02, 6:17 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. త్రాసు ముళ్ళు కేది వాసి గల్గిన పేరు..?
చీల యనగ నేది చెలువు మీర..?
ఇల కటి ప్రదేశ మేదౌచు నొప్పారు ..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 546
జవాబు … ?
(నిన్నటి జవాబు .. మిత్తి )
[11/02, 6:14 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. అరసి కదలకుండ సరిగూర్చు టేమండ్రు..?
గడ్డి గోసి తాట గట్ట నేది ..?
నిక్కి పరుల పైన నింద వేయుట నేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 547
జవాబు … ?
(నిన్నటి జవాబు .. మొల)
[11/02, 6:22 am] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. అరసి కదలకుండ సరిగూర్చు మోపును
గడ్డి గోసి తాట గట్టు మోపు
నిక్కి పరుల పైన నింద మోపగరాదు
మూట నొక్క మాట ముద్దు బాల..! 547
[12/02, 6:26 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. మహిని పద్య విశ్రమస్థాన మన నేది..?
విష్ణువునకు నొండు పేర దేమి..?
తపము జేసికొనెడు తాత నే మనవచ్చు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 548
జవాబు … ?
(నిన్నటి జవాబు .. మోపు)

[12/02, 8:01 pm] Narsimhareddypavani: …..... తెలుగు సాహితీ పీఠము ........
...... పద్యప్రియు లందరికి ఆహ్వానం ......
... పద్య రచనా శిక్షణా శిబిరం, (పద్యకార్యశాల) ...
తేది: 16 - 02 - 2020 ఆదివారం, ఉ. 10. గం. లకు
డా. నలవోలు నరసింహా రెడ్డి, తెలుగు సాహితీ పీఠము
గారిచే ఉచిత పద్య శిక్షణా తరగతులు నిర్వహించ
బడుతాయి. అందులో తేటగీతి, సీసము పద్యాలు
నేర్పించబడుతాయి.
......... వేదిక ........
తెలంగాణా సారస్వత పరిషత్తు
బొగ్గుల కుంట, హైదరాబాద్,
........... కార్యక్రమ సరళి ...........
10 గం లకు తరగతులు ప్రారంభం ...
1.30 to 2.00 భోజన విరామం ...
2.05 to 4.15 ని. వరకు తరగతులు...
పద్యముపై పూర్తి అవగాహన కల్పించి
ఒకొక్కరు కనీసం 2 పద్యాలు రాసే ప్రయత్నం
చేయిస్తాము...
ఇట్లు
డాక్టర్. నలవోలు నరసింహా రెడ్డి
అధ్యక్షులు:- తెలుగు సాహితీ పీఠము
[13/02, 6:44 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. ఇష్ట పడుట యనగ నింపైన పదమేది..?
సరుసగ నొక వైపు వంగ నేది..?
హెచ్చు బరువు వైపు కెమిచేయు తరాజు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 549
జవాబు … ?
(నిన్నటి జవాబు .. యతి )
[14/02, 6:39 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. చాయ యనగ వరల సరియైన పదమేది..?
కాంతి కేది నొండు గలుగు పేరు..?
వర్ణమునకు వేరు వసుధ నెయ్యది యొప్పు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 550
జవాబు … ?
(నిన్నటి జవాబు .. ముగ్గు)
[15/02, 6:12 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
'కుల'మటన్న నేది కువలయంబున గాంచ ..?
రాజిలు పిలుపేది 'రంగు' కొప్పు..?
'అక్షరము'న కేది నలరారు పదమొండు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 551
జవాబు … ?
మొన్నటి జవాబు .. మొగ్గు
(నిన్నటి జవాబు .. రంగు )
[15/02, 7:31 pm] Narsimhareddypavani: …..... తెలుగు సాహితీ పీఠము ........
...... పద్యప్రియు లందరికి ఆహ్వానం ......
... పద్య రచనా శిక్షణా శిబిరం, (పద్యకార్యశాల) ...
తేది: 16 - 02 - 2020 ఆదివారం, ఉ. 10. గం. లకు
డా. నలవోలు నరసింహా రెడ్డి, తెలుగు సాహితీ పీఠము
గారిచే ఉచిత పద్య శిక్షణా తరగతులు నిర్వహించ
బడుతాయి. అందులో తేటగీతి, సీసము పద్యాలు
నేర్పించబడుతాయి.
......... వేదిక ........
తెలంగాణా సారస్వత పరిషత్తు
బొగ్గుల కుంట, హైదరాబాద్,
........... కార్యక్రమ సరళి ...........
10 గం లకు తరగతులు ప్రారంభం ...
1.30 to 2.00 భోజన విరామం ...
2.05 to 4.15 ని. వరకు తరగతులు...
పద్యముపై పూర్తి అవగాహన కల్పించి
ఒకొక్కరు కనీసం 2 పద్యాలు రాసే ప్రయత్నం
చేయిస్తాము...
ఇట్లు
డాక్టర్. నలవోలు నరసింహా రెడ్డి
అధ్యక్షులు:- తెలుగు సాహితీ పీఠము
[16/02, 6:18 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. చదువు చేత నరుడు సాధించు నెద్దాని..?
ఒప్పు నట్టి దేది యుక్త మనగ..?
అర్హత యన నేది యావజ్జగంబులో..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 552
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వర్ణము)
[17/02, 6:12 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. ఇల నదృష్ట మగుచు వెలయు చుండిన దేది..?
పరవశింప జేయు ప్రాప్తి యేది..?
పూని వచ్చి చేరు భోగమ్ము నేమండ్రు
మూట నొక్క మాట ముద్దు బాల..! 553
జవాబు … ?
(నిన్నటి జవాబు .. యోగ్యత )
[18/02, 6:30 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. విధ మటన్న నొండు విలువైన పదమేది..?
భూమి పన్ను కేది పోల్చి చెప్ప..?
సుందర మని చెప్ప సొంపైన పలుకేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 554
జవాబు … ?
(నిన్నటి జవాబు .. యోగము)
[19/02, 6:24 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. రాగి యనగ వేరు రంజిల్లు పద మేది..?
ఎరుపు కెట్టి మాట యెరుక గొనగ..?
నెత్తురనగ నొప్పు నిజమైన పలుకేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 555
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రకము)
[20/02, 6:24 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. గుణములందు నొకటి గుర్తు చెప్పగనేది..?
పుప్పొడి యననేది పోల్చి చెప్ప..?
ధూళి యనగ నొండు తోరంపు మాటేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 556
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రక్తము)
[20/02, 9:57 pm] Narsimhareddypavani: ......... తెలుగు సాహితీ పీఠము .........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
మాతృ భాష దినోత్సవ శుభాకాంక్షలతో
.... తేనియల్ చిందు నా భాష తెలుగు భాష ....
గీ. విశ్వమందు నజంతమై వెలుగు లీని
తనరు పదగతుల ప్రమోదంబు నింపి
నవ నవోన్మేష సచ్చిదానంద మగుచు
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష 1
గీ. ప్రబల ఛందో నియతి గల్గి, ప్రాస గలిగి,
యతులు గలిగి, సుందర పద గతులు గలిగి,
యలర నెడద లూపు రస పద్యములు గలిగి,
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష 2
గీ. పద్య, వచన, గేయ, కవిత, ప్రక్రియలుగ
సుందరంబైన రస భావ సుధలు గురిసి
ముగ్ధ మోహన పదబంధ ముద్దు లొలికి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష 3
గీ. మంజుల రస ఝరుల్ మృదు మధురమైన
పద్య శిల్పము దివ్యాను ప్రాస గలిగి
యింపు లయల తోడ హొయలు నింపి హృదికి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష 4
గీ. మంజు మంజుల మంజీర శింజితముల
కింకిణీ క్వాణ విన్యాస కిన్నెరగుచు
పద సుశోభిత ధ్వానమ్ము పరిఢవిల్లి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష 5
గీ. మాండలికములు, సూక్తులు మార్దవంపు
పలుకు బడులు, ధ్వనులు, శబ్ద పల్లవములు
మిగుల సుందరమైన సామెతలు గలిగి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష 6
గీ. కమ్రపు చలోక్తులు, పొడుపు కతలు నిండి
గేయ కతలు, జాతీయాల కెంపు లుండి
రమ్య భరిత మైన నుడికారములు పండి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష 7
గీ. వన్నె దరుగని సొమ్ములై చెన్ను మీరి
సొంపు గూర్చెడు శబ్దార్థ శోభ లలర
యిమ్ముగా నలంకారము లింపు గూర్ప
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష 8
గీ. ఆది కవి నన్నయార్యుచే నవతరించి
యిల "మహా భారతము'' పేర వెలిగి పోయి
ఉరు పంచమ వేదమై యుప్పతిల్లి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష - 9
గీ. రమ్య మైన నానా రుచిరార్థ సూక్తి
తా ప్రసన్న కథా కలితార్థ యుక్తి
సొబగు నక్షర రమ్యత సోంపు నింపి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష - 10
[21/02, 6:25 am] Narsimhareddypavani: మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలత్తో
........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. తాల్మితోడ కట్టు తాయత్తు నేమండ్రు..?
లక్క కెట్టి పేరు నిక్కువముగ..?
పిల్లలకును బెట్టు వేలిమిబొట్టేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 557
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రజము, రజస్సు)
[22/02, 6:18 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. నింద యనగ నొండు నిక్కంపు పలుకేది..?
ఆపద యను దాని కరయనేది..?
గుట్టు చెదిరి పోవ గురుతైన పదమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 558
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రక్ష)
[23/02, 6:17 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. ఇడ్లి వండు చూర్ణ మేమన నొప్పారు..?
వజ్రమునకు పేరు వసుధ నేది..?
నెపము వలన గల్గు నపకీర్తి యననేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 559
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రట్టు)
[23/02, 11:12 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
[24/02, 6:22 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. స్వర్ణమునకు మారు సరసంపు పేరేది..?
నాలుక యన నేది నయము గాను..?
పొట్ట నింపు కొనెడు భోజనం బన నేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 560
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రవ్వ)
[25/02, 6:24 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. స్వర్ణమునకు మారు సరసంపు పేరేది..?
నాలుక యన నేది నయము గాను..?
పొట్ట నింపు కొనెడు భోజనం బన నేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 560
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రవ్వ)
[25/02, 6:28 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. సాగతీత కేది సంగీత మందున..?
ప్రేమ యనగ నేది పేర్మితోడ..?
రంగుకెట్టి పేరు రాజిల్లు భువిలోన..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 561
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రసన, రసనము)
[26/02, 6:26 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. కన 'ప్రసిద్ధ మైన'దని చెప్ప గల దేది..?
'అటుల' యనుచు తెలుప నరయ నేది ..?
భువి 'తరంగము'నకు పొలుపైన పేరేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 562
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రాగము)
[27/02, 7:15 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. కాంతి యనగ మారు గలదు వేరొక పేరు..?
భార్య కొండు పేరు పలుక నేది..?
లక్ష్మి కెట్టి పేరు రాజిల్లు భువిలోన..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 563
జవాబు … ?
(నిన్నటి జవాబు .. అల)
[28/02, 6:20 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
మనుజులందు నలరు మర్యాద యన నేది..?
విధ మటన్న నేది వివరముగను..?
కావ్య రచన యందు గల శైలి నేమండ్రు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 564
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రమ)
[29/02, 6:21 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. కాంతి కెట్టి పేరు కమనీయమై యొప్పు..?
చవి యటన్న నేది సరస ముగను ..?
కమ్మదన మటన్న నిమ్మైన పదమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 565
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రీతి)
[01/03, 6:16 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. కొలను కొండు పేరు కోరిచెప్పగ నేది..?
సంఖ్య కెట్టి పేరు చాట వచ్చు..?
సంద్రమునకు నేది సరియైన నొక పేరు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 566
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రుచి)
[02/03, 6:12 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. 'నెక్కరు'నకు వేరు నిక్కంపు పేరేది..?
'ఈడ్చు' టనగ నేది యెఱుక జెప్ప..?
'విధ'మటన్నమారు వివరించు మాటేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 567
జవాబు … ?
(నిన్నటి జవాబు .. అబ్ధి)
[03/03, 6:09 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. చీమ కొండు పేరు చెప్పబూనఁగనేది..?
ప్రాకు తీగ కేది వరలు పేరు..?
కలిగి యుండు పేరు కస్తూరి కొకటేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 568
జవాబు … ?
(నిన్నటి జవాబు .. లాగు)
[04/03, 6:22 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. ఈప్సిత మన నొక్క యింపైన పదమేది..?
ఇల మనోజ్ఞ మనగ నేది యొప్పు..?
చూడ చక్క నైన సుకుమార మననేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 569
జవాబు … ?
(నిన్నటి జవాబు .. లత)
[05/03, 6:14 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. పక్షమనగ నేది పాటిజెప్పెడు మాట..?
ఇలను చిన్ని చంద్రు డెటుల దోచు..?
సాకు కొండు వేరు సరియైన పదమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 570
జవాబు … ?
(నిన్నటి జవాబు .. లలితము)
[06/03, 6:15 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. పిలువ నేది యొప్పు పిల్లనగ్రోవికి..?
కులము జెప్పబోనుకొరకు నేది..?
తెగ యటన్న నేది తేల్చి చెప్పగవచ్చు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 571
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వంక)
[07/03, 6:15 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
మాయ చేష్ట కేది మారు జెప్పగ వచ్చు..?
ఆట యనగ నేది యరయ నెంచ..?
కోరి కృష్ణు డేది గోపికలకు జూపె..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 572
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వంశము)
[08/03, 6:19 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. తేలికైన దనుచు తేల్చి చెప్పగ నేది..?
చిటికలోన బలుక జెల్లు నేది..?
వడిగల దని చాట వరలు చుండున దేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 573
జవాబు … ?
(నిన్నటి జవాబు .. లీల)
[08/03, 7:22 am] Laxmaiah: *తేది:14-03-2020 శనివారం రోజు తడకపల్లి ఆవాసవిద్యాలయంలో*
*డాక్టర్ నలవోలు నరసింహారెడ్డి* *గారిచే విరచితంబైన ముద్దుబాల శతకము -2*
*ఆవిష్కరణ కార్యక్రమము గలదు.*
*కావున సాహితి*
*ప్రియులైన కవిమిత్రులందరు* *విచ్చేసి కార్యక్రమాన్ని* *జయప్రదం చేయ వలసిందిగా*
*కోరుతున్నాను.*
వరుకోలు లక్ష్మయ్య తెలుగుసహాయకులు
సిద్ధిపేట
[08/03, 9:18 am] Narsimhareddypavani: ... మధుర మైన తెలుగు మాతృభాష ...
రావూరి వనజ
అధ్యక్షులు : తెలంగాణా మహిళా
సాహిత్య, సాంస్కృతిక సంస్థ
ఆ. తేటతెల్లమైన తెలుగు భాష మధుర
మధువు లొలుకు నట్టి మంజు భాష
కమ్మనైన నాదు కమనీయ భాషకు
సాటి వచ్చు భాష జగతి లేదు 1
ఆ. సర్వ జగతిలో నజంత భాషగ వెల్గి
మధురిమలను బంచు మనుజ తతికి
పలుకు పలుకు నందు పరిమళమ్ములు జిందు
తెలుగు భాష జగతి వెలుగు భాష 2
ఆ. అంద చంద మొప్పు నన్నిభాషలలోన
ఎన్న జగతిలోన మిన్న భాష
మాటలాడునపుడు మమతాను రాగాలు
పంచిపెట్టు నట్టి భాష తెలుగు 3
ఆ. మేలయిన తెలుగు ఇటాలియన్ ఆఫ్ యీస్టు
జగతి సుందరమని చాటి చెప్పి
తెలుగు గొప్ప తనము తెలుసు కొనుచు నాంగ్ల
ప్రజలు మురిసి తెలుగు భాష ననిరి 4
ఆ. నాదు మాతృ భాష నవనీత మగుభాష
నాదు భాష కేను నతులొనర్తు
మనసు మోసులెత్త మాతృ భాష దినము
జరుపు కొంద మిపుడు జయము గలుగ 5
-----------
[08/03, 9:50 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
..... అంతర్జాతీయ మహిళాదినోత్సవం .....
ఆ. మహిళ యాది శక్తి, మహిళ పరాశక్తి,
మహిళ యపర శక్తి, మహిళ యుక్తి,
మహిళ మహిత శక్తి, మహిలోన ననురక్తి,
మహిళ లేక భువిని మనుగడేది...?
ఆ. మహిళ యింటి వెలుగు, మహిళ శాంతి పులుగు,
మహిళ చేత చెలగు, మహిళ యలుగు,
మహిళ తోడ కలుగు మమతాను రాగాలు
నిండిపారు నలుగు గుండెలోన
ఆ. మహిళ శక్తి నెరిగి మహిళల కొకరోజు
పర్వదినము జరిప పాటువడుచు
సాధు భావమూని సహకార మందించి
జరుపుడిట్టి రోజు జయము గలుగ
----------
[08/03, 10:20 pm] Narsimhareddypavani: చదువుల్ సాములు, శాస్త్రచర్చ, ధరణీ సాహిత్య శిల్పంబులున్
కదనంబందనురక్తి, గాన, కవితా, కమ్రంపు విజ్ఞానమున్
సుధలంజిమ్మెడి పాకశాస్త్ర విధియుం సొంపైన లాలిత్యమున్
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్
[09/03, 6:33 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. చాటి చెప్పు మాట సంతాపమున కేది..?
ఏరు నెటుల బిలుతు రిలను జనులు ..?
గాయకునకు వెనుకగా పాడు స్వరమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 574
జవాబు … ?
(నిన్నటి జవాబు .. లఘువు)
[10/03, 6:20 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. చాటి చెప్ప బూన సామర్థ్య మననేది..?
బలము కొండు పేరు పిలువ నేది..?
స్థూల కాయమనచు నేల బిల్వగ వచ్చు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 575
జవాబు … ?
(నిన్నటి జవాబు .. లఘువు)
[11/03, 6:19 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. పంపు మనగ వేరు సొంపైన పదమేది..?
వితరణ యన నేది వివరముగను..?
ప్రియము మీర పాలు విభజించు మననేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 576
జవాబు … ?
(మొన్నటి జవాబు574 .. వంత)
(నిన్నటి జవాబు 575 .. లావు )
[12/03, 6:28 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. మిన్న యైన దనుచు యెన్నగా నొకటేది..?
శ్రేష్ఠ మనెడు మాట జెప్పు టెట్లు..?
పుష్కలమని పిలువఁ పొసఁగు చుండునదేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 577
జవాబు … ?
(నిన్నటి జవాబు .. పంచు)
[13/03, 6:31 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. వసుధలో నుపద్రవ మన నెయ్యది యొప్పు..?
కొల్ల గొట్టుటనగ కూడు నేది..?
దోపిడి యన నొండు రూపించు పదమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 578
జవాబు … ?
(నిన్నటి జవాబు .. లెస్స)
[13/03, 11:08 pm] Laxmaiah: *తేది:14-03-2020 శనివారం రోజు ఉదయం10-00గంటలకు తడకపల్లి ఆవాసవిద్యాలయంలో*
*డాక్టర్ నలవోలు నరసింహారెడ్డి* *గారిచే విరచితంబైన ముద్దుబాల శతకము -2*
*ఆవిష్కరణ కార్యక్రమము గలదు.*
*కావున సాహితి*
*ప్రియులైన కవిమిత్రులందరు* *విచ్చేసి కార్యక్రమాన్ని* *జయప్రదం చేయ వలసిందిగా*
*కోరుతున్నాను.*
*వరుకోలు లక్ష్మయ్య తెలుగుసహాయకులు*
*సిద్ధిపేట*
*9704865816*
[14/03, 6:13 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. బంతి లోన చారు వడ్డించు మననేది..?
పొగరు ననుచటన్న పొసఁగు నేది..?
వంగ జేయుటనగ వరుసైన పదమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 579
జవాబు … ?
(నిన్నటి జవాబు .. లూటీ)
[15/03, 6:15 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
కూర గాయ పేర కూడు దేశంబేది..?
నడుము వంచ మనుచు నుడువు టెట్లు..?
వరలు నొక్క పేరు వంకాయ కెయ్యది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 580
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వంచు)
[16/03, 6:14 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
దారము పురి బిగిసి తీరు మారగ నేది..?
పలుక దగినదేది పద్య యతికి..?
వేగమునకు వేరు పేరు జెప్పగ నేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 581
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వంగ)
[17/03, 6:06 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఇల నదృష్ట మనగ నేది యొప్పెడు పల్కు..?
పోటీ యనగ నేది పొసగు చుండు..?
పాలు (వంతు) యనగ నేది వలనొప్పు నొకమాట..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 582
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వడి)
[18/03, 6:45 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. పట్టణ మననేది గుట్టువిప్పుచు జూడ..?
ఈత డనుచు చెప్ప నేది యొప్పు..?
వదులు టనగ నొక్క వరుసైన పదమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 583
జవాబు … ?
(నిన్నటి జవాబు .. భాగం)
[19/03, 6:26 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. అంటుకొనుట యన్న నరుదైన దొకటేది..?
తాకు టనగ నేది ప్రాకటముగ..?
చిక్కుటనగ వేరు చిత్రంపు పలుకేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 584
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వీడు)
[20/03, 6:27 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. అడవి యనుచు జెప్ప నలరారునది యేది..?
తోట యనగ నేది తోరముగను..?
జలము కొండు పేరు జగతి లోపలనేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 585
జవాబు … ?
(నిన్నటి జవాబు .. తగులు)
[21/03, 6:35 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. బియ్యమందు రాళ్లు వేరుచేయుట నేది..?
చిన్ని నదికి పేరు జెప్పనేది..?
అరయ నెడ్ల గట్టె డరక నే మనవచ్చు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 586
జవాబు … ?
(నిన్నటి జవాబు ..వనము )
[22/03, 7:08 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. తరుల గొడ్డలెత్తి నరుకు మనుట నేది..?
బాదు మనుట నేది బరిక తోడ..?
అరయగా దుకాన మననేది సరితూగు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 587
జవాబు … ?
(నిన్నటి జవాబు .. ఏరు )
[23/03, 6:18 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. శ్రమకు నొండు నేది సరిపోల్చగావచ్చు
ఎండతాపమునకు నెట్టి పేరు..?
ఉబ్బు గారె కేది యొప్పి యుండెడు పేరు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 588
జవాబు … ?
(నిన్నటి జవాబు .. కొట్టు )
[24/03, 7:56 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. మిసిమి కాంతి కెట్టి మేలైన పదమొప్పు..?
అరయ నేది యలరు నందమునకు..?
వర్ణమునకు నెద్ది వచియించె డొకమాట..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 589
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వడ)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. పొగడ చెట్టు కేది పోల్చి చెప్పెడు పేరు..?
మోద మలరు పేరు మొగ్గ కేది ..?
అద్దమునకు నొండు ముద్దైన పేరేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 540
జవాబు … ?
(నిన్నటి జవాబు .. సత్తా)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. అరయఁగ నెఱిగించు మననేది వివరించ..?
ధవళ వర్ణ మనగ తనరు నేది..?
స్వచ్ఛ మైన దనుచు చాటి చెప్పగ నేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 544
జవాబు … ?
(నిన్నటి జవాబు .. మొండి)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
నిద్ర తీరి పోవ నెలకొనునది యేది..?
వర్తనమున కేది వరలు పలుకు
సరసమైన మాట జాగరూకతకేది
మూట నొక్క మాట ముద్దు బాల..! 541
జవాబు … ?
(నిన్నటి జవాబు .. ముకురము, ముకురం)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. మాట వినని మూర్ఖ మనుజు నే మని యండ్రు..?
తెగని కత్తి నెటుల తెలుపవచ్చు..?
శిఖలు నరకి వేయ చెట్టు లెట్టుల దోచు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 543
జవాబు … ?
(నిన్నటి జవాబు .. మొక్క)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. ఏది పోనీ ధైర్య మిలను వీరున కుండు ..?
కాల్తు రెట్టి జొన్న కండె దినగ..?
చిన్ని చెట్టు కేది చెన్నుమీరెడు పేరు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 542
జవాబు … ?
(నిన్నటి జవాబు .. మెలకువ)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. అధిక మనగ నేది యరసి చెప్పగ బూన..?
వడ్డి కొండు పదము పలుక నేది..?
నిత్య భయము గొల్పు మృత్యువు నేమండ్రు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 545
జవాబు … ?
(నిన్నటి జవాబు .. తెలుపు)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. మహిని పద్య విశ్రమస్థాన మన నేది..?
విష్ణువునకు నొండు పేర దేమి..?
తపము జేసికొనెడు తాత నే మనవచ్చు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 548
జవాబు … ?
(నిన్నటి జవాబు .. మోపు)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. అరసి కదలకుండ సరిగూర్చు టేమండ్రు..?
గడ్డి గోసి తాట గట్ట నేది ..?
నిక్కి పరుల పైన నింద వేయుట నేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 547
జవాబు … ?
(నిన్నటి జవాబు .. మొల)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. త్రాసు ముళ్ళు కేది వాసి గల్గిన పేరు..?
చీల యనగ నేది చెలువు మీర..?
ఇల కటి ప్రదేశ మేదౌచు నొప్పారు ..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 546
జవాబు … ?
(నిన్నటి జవాబు .. మిత్తి )
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
'కుల'మటన్న నేది కువలయంబున గాంచ ..?
రాజిలు పిలుపేది 'రంగు' కొప్పు..?
'అక్షరము'న కేది నలరారు పదమొండు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 551
జవాబు … ?
మొన్నటి జవాబు .. మొగ్గు
(నిన్నటి జవాబు .. రంగు )
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. ఇష్ట పడుట యనగ నింపైన పదమేది..?
సరుసగ నొక వైపు వంగ నేది..?
హెచ్చు బరువు వైపు కెమిచేయు తరాజు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 549
జవాబు … ?
(నిన్నటి జవాబు .. యతి )
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. చాయ యనగ వరల సరియైన పదమేది..?
కాంతి కేది నొండు గలుగు పేరు..?
వర్ణమునకు వేరు వసుధ నెయ్యది యొప్పు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 550
జవాబు … ?
(నిన్నటి జవాబు .. ముగ్గు)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. ఇల నదృష్ట మగుచు వెలయు చుండిన దేది..?
పరవశింప జేయు ప్రాప్తి యేది..?
పూని వచ్చి చేరు భోగమ్ము నేమండ్రు
మూట నొక్క మాట ముద్దు బాల..! 553
జవాబు … ?
(నిన్నటి జవాబు .. యోగ్యత )
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. చదువు చేత నరుడు సాధించు నెద్దాని..?
ఒప్పు నట్టి దేది యుక్త మనగ..?
అర్హత యన నేది యావజ్జగంబులో..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 552
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వర్ణము)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. నింద యనగ నొండు నిక్కంపు పలుకేది..?
ఆపద యను దాని కరయనేది..?
గుట్టు చెదిరి పోవ గురుతైన పదమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 558
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రక్ష)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. గుణములందు నొకటి గుర్తు చెప్పగనేది..?
పుప్పొడి యననేది పోల్చి చెప్ప..?
ధూళి యనగ నొండు తోరంపు మాటేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 556
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రక్తము)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. విధ మటన్న నొండు విలువైన పదమేది..?
భూమి పన్ను కేది పోల్చి చెప్ప..?
సుందర మని చెప్ప సొంపైన పలుకేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 554
జవాబు … ?
(నిన్నటి జవాబు .. యోగము)
[24/03, 1:32 pm] Laxmaiah: ......... తెలుగు సాహితీ పీఠము .........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
మాతృ భాష దినోత్సవ శుభాకాంక్షలతో
.... తేనియల్ చిందు నా భాష తెలుగు భాష ....
గీ. విశ్వమందు నజంతమై వెలుగు లీని
తనరు పదగతుల ప్రమోదంబు నింపి
నవ నవోన్మేష సచ్చిదానంద మగుచు
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష 1
గీ. ప్రబల ఛందో నియతి గల్గి, ప్రాస గలిగి,
యతులు గలిగి, సుందర పద గతులు గలిగి,
యలర నెడద లూపు రస పద్యములు గలిగి,
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష 2
గీ. పద్య, వచన, గేయ, కవిత, ప్రక్రియలుగ
సుందరంబైన రస భావ సుధలు గురిసి
ముగ్ధ మోహన పదబంధ ముద్దు లొలికి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష 3
గీ. మంజుల రస ఝరుల్ మృదు మధురమైన
పద్య శిల్పము దివ్యాను ప్రాస గలిగి
యింపు లయల తోడ హొయలు నింపి హృదికి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష 4
గీ. మంజు మంజుల మంజీర శింజితముల
కింకిణీ క్వాణ విన్యాస కిన్నెరగుచు
పద సుశోభిత ధ్వానమ్ము పరిఢవిల్లి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష 5
గీ. మాండలికములు, సూక్తులు మార్దవంపు
పలుకు బడులు, ధ్వనులు, శబ్ద పల్లవములు
మిగుల సుందరమైన సామెతలు గలిగి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష 6
గీ. కమ్రపు చలోక్తులు, పొడుపు కతలు నిండి
గేయ కతలు, జాతీయాల కెంపు లుండి
రమ్య భరిత మైన నుడికారములు పండి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష 7
గీ. వన్నె దరుగని సొమ్ములై చెన్ను మీరి
సొంపు గూర్చెడు శబ్దార్థ శోభ లలర
యిమ్ముగా నలంకారము లింపు గూర్ప
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష 8
గీ. ఆది కవి నన్నయార్యుచే నవతరించి
యిల "మహా భారతము'' పేర వెలిగి పోయి
ఉరు పంచమ వేదమై యుప్పతిల్లి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష - 9
గీ. రమ్య మైన నానా రుచిరార్థ సూక్తి
తా ప్రసన్న కథా కలితార్థ యుక్తి
సొబగు నక్షర రమ్యత సోంపు నింపి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష - 10
[24/03, 1:32 pm] Laxmaiah: మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలత్తో
........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. తాల్మితోడ కట్టు తాయత్తు నేమండ్రు..?
లక్క కెట్టి పేరు నిక్కువముగ..?
పిల్లలకును బెట్టు వేలిమిబొట్టేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 557
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రజము, రజస్సు)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. రాగి యనగ వేరు రంజిల్లు పద మేది..?
ఎరుపు కెట్టి మాట యెరుక గొనగ..?
నెత్తురనగ నొప్పు నిజమైన పలుకేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 555
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రకము)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. ఇడ్లి వండు చూర్ణ మేమన నొప్పారు..?
వజ్రమునకు పేరు వసుధ నేది..?
నెపము వలన గల్గు నపకీర్తి యననేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 559
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రట్టు)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. స్వర్ణమునకు మారు సరసంపు పేరేది..?
నాలుక యన నేది నయము గాను..?
పొట్ట నింపు కొనెడు భోజనం బన నేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 560
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రవ్వ)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. కాంతి యనగ మారు గలదు వేరొక పేరు..?
భార్య కొండు పేరు పలుక నేది..?
లక్ష్మి కెట్టి పేరు రాజిల్లు భువిలోన..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 563
జవాబు … ?
(నిన్నటి జవాబు .. అల)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
మనుజులందు నలరు మర్యాద యన నేది..?
విధ మటన్న నేది వివరముగను..?
కావ్య రచన యందు గల శైలి నేమండ్రు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 564
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రమ)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. స్వర్ణమునకు మారు సరసంపు పేరేది..?
నాలుక యన నేది నయము గాను..?
పొట్ట నింపు కొనెడు భోజనం బన నేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 560
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రవ్వ)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. సాగతీత కేది సంగీత మందున..?
ప్రేమ యనగ నేది పేర్మితోడ..?
రంగుకెట్టి పేరు రాజిల్లు భువిలోన..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 561
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రసన, రసనము)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. కన 'ప్రసిద్ధ మైన'దని చెప్ప గల దేది..?
'అటుల' యనుచు తెలుప నరయ నేది ..?
భువి 'తరంగము'నకు పొలుపైన పేరేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 562
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రాగము)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
మాయ చేష్ట కేది మారు జెప్పగ వచ్చు..?
ఆట యనగ నేది యరయ నెంచ..?
కోరి కృష్ణు డేది గోపికలకు జూపె..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 572
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వంశము)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. కొలను కొండు పేరు కోరిచెప్పగ నేది..?
సంఖ్య కెట్టి పేరు చాట వచ్చు..?
సంద్రమునకు నేది సరియైన నొక పేరు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 566
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రుచి)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. ఈప్సిత మన నొక్క యింపైన పదమేది..?
ఇల మనోజ్ఞ మనగ నేది యొప్పు..?
చూడ చక్క నైన సుకుమార మననేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 569
జవాబు … ?
(నిన్నటి జవాబు .. లత)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. కాంతి కెట్టి పేరు కమనీయమై యొప్పు..?
చవి యటన్న నేది సరస ముగను ..?
కమ్మదన మటన్న నిమ్మైన పదమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 565
జవాబు … ?
(నిన్నటి జవాబు .. రీతి)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. పిలువ నేది యొప్పు పిల్లనగ్రోవికి..?
కులము జెప్పబోనుకొరకు నేది..?
తెగ యటన్న నేది తేల్చి చెప్పగవచ్చు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 571
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వంక)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. పక్షమనగ నేది పాటిజెప్పెడు మాట..?
ఇలను చిన్ని చంద్రు డెటుల దోచు..?
సాకు కొండు వేరు సరియైన పదమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 570
జవాబు … ?
(నిన్నటి జవాబు .. లలితము)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. చీమ కొండు పేరు చెప్పబూనఁగనేది..?
ప్రాకు తీగ కేది వరలు పేరు..?
కలిగి యుండు పేరు కస్తూరి కొకటేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 568
జవాబు … ?
(నిన్నటి జవాబు .. లాగు)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. 'నెక్కరు'నకు వేరు నిక్కంపు పేరేది..?
'ఈడ్చు' టనగ నేది యెఱుక జెప్ప..?
'విధ'మటన్నమారు వివరించు మాటేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 567
జవాబు … ?
(నిన్నటి జవాబు .. అబ్ధి)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. చాటి చెప్ప బూన సామర్థ్య మననేది..?
బలము కొండు పేరు పిలువ నేది..?
స్థూల కాయమనచు నేల బిల్వగ వచ్చు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 575
జవాబు … ?
(నిన్నటి జవాబు .. లఘువు)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
కూర గాయ పేర కూడు దేశంబేది..?
నడుము వంచ మనుచు నుడువు టెట్లు..?
వరలు నొక్క పేరు వంకాయ కెయ్యది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 580
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వంచు)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. మిన్న యైన దనుచు యెన్నగా నొకటేది..?
శ్రేష్ఠ మనెడు మాట జెప్పు టెట్లు..?
పుష్కలమని పిలువఁ పొసఁగు చుండునదేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 577
జవాబు … ?
(నిన్నటి జవాబు .. పంచు)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. చాటి చెప్పు మాట సంతాపమున కేది..?
ఏరు నెటుల బిలుతు రిలను జనులు ..?
గాయకునకు వెనుకగా పాడు స్వరమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 574
జవాబు … ?
(నిన్నటి జవాబు .. లఘువు)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. వసుధలో నుపద్రవ మన నెయ్యది యొప్పు..?
కొల్ల గొట్టుటనగ కూడు నేది..?
దోపిడి యన నొండు రూపించు పదమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 578
జవాబు … ?
(నిన్నటి జవాబు .. లెస్స)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. బంతి లోన చారు వడ్డించు మననేది..?
పొగరు ననుచటన్న పొసఁగు నేది..?
వంగ జేయుటనగ వరుసైన పదమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 579
జవాబు … ?
(నిన్నటి జవాబు .. లూటీ)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. పంపు మనగ వేరు సొంపైన పదమేది..?
వితరణ యన నేది వివరముగను..?
ప్రియము మీర పాలు విభజించు మననేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 576
జవాబు … ?
(మొన్నటి జవాబు574 .. వంత)
(నిన్నటి జవాబు 575 .. లావు )
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. తేలికైన దనుచు తేల్చి చెప్పగ నేది..?
చిటికలోన బలుక జెల్లు నేది..?
వడిగల దని చాట వరలు చుండున దేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 573
జవాబు … ?
(నిన్నటి జవాబు .. లీల)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. అడవి యనుచు జెప్ప నలరారునది యేది..?
తోట యనగ నేది తోరముగను..?
జలము కొండు పేరు జగతి లోపలనేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 585
జవాబు … ?
(నిన్నటి జవాబు .. తగులు)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. పట్టణ మననేది గుట్టువిప్పుచు జూడ..?
ఈత డనుచు చెప్ప నేది యొప్పు..?
వదులు టనగ నొక్క వరుసైన పదమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 583
జవాబు … ?
(నిన్నటి జవాబు .. భాగం)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఇల నదృష్ట మనగ నేది యొప్పెడు పల్కు..?
పోటీ యనగ నేది పొసగు చుండు..?
పాలు (వంతు) యనగ నేది వలనొప్పు నొకమాట..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 582
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వడి)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. అంటుకొనుట యన్న నరుదైన దొకటేది..?
తాకు టనగ నేది ప్రాకటముగ..?
చిక్కుటనగ వేరు చిత్రంపు పలుకేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 584
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వీడు)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
దారము పురి బిగిసి తీరు మారగ నేది..?
పలుక దగినదేది పద్య యతికి..?
వేగమునకు వేరు పేరు జెప్పగ నేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 581
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వంగ)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. మిసిమి కాంతి కెట్టి మేలైన పదమొప్పు..?
అరయ నేది యలరు నందమునకు..?
వర్ణమునకు నెద్ది వచియించె డొకమాట..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 589
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వడ)
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. శ్రమకు నొండు నేది సరిపోల్చగావచ్చు
ఎండతాపమునకు నెట్టి పేరు..?
ఉబ్బు గారె కేది యొప్పి యుండెడు పేరు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 588
జవాబు … ?
(నిన్నటి జవాబు .. కొట్టు )
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. బియ్యమందు రాళ్లు వేరుచేయుట నేది..?
చిన్ని నదికి పేరు జెప్పనేది..?
అరయ నెడ్ల గట్టె డరక నే మనవచ్చు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 586
జవాబు … ?
(నిన్నటి జవాబు ..వనము )
[24/03, 1:32 pm] Laxmaiah: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. తరుల గొడ్డలెత్తి నరుకు మనుట నేది..?
బాదు మనుట నేది బరిక తోడ..?
అరయగా దుకాన మననేది సరితూగు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 587
జవాబు … ?
(నిన్నటి జవాబు .. ఏరు )
[25/03, 7:08 am] Narsimhareddypavani: కవి మిత్రులెల్లరకు శార్వరి నామ తెలుగు సంవత్సర
శుభోదయ ఉగాది శుభాకాంక్షలతో
........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. శ్రేష్ఠు డయిన వాని చెప్పబూనుట నెట్లు..?
పెండ్లి కొడుకు నెట్లు పిలువ వచ్చు..?
రాజు కొండు పేరు రంజిల్లు నెయ్యది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 590
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వన్నె, వన్నియ)
[26/03, 6:22 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. జోకతోడ చేరి తాకు టే మనవచ్చు..?
గ్రోలు టనగ నేది కోరి చెప్ప..?
ఊతగా గొనుటకు నొప్పెడు పలుకేది ..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 591
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వరుడు)
[27/03, 6:15 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. పశులు త్రాగ నీరు పట్టమనుట నేది..?
బాధ యనగ నేది పాటి జెప్ప..?
వేడి యనగ నొండు విన్నవించుట కేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 592
జవాబు … ?
(నిన్నటి జవాబు .. ఆను)
[28/03, 6:20 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ.ఇల్లు నేమి టండ్రు యింపు మీరెడు రీతి ..?
సౌఖ్య మనగ నేది చాటి చెప్ప..?
రాత్రి యనగ మారు రాజిల్లునది యేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 593
జవాబు … ?
(నిన్నటి జవాబు .. తాపం, తాపము)
[29/03, 6:20 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. ఉత్త దనగ నేది యూహజేయుచు జెప్ప..?
ఎండినదని చెప్ప నేది యొప్పు..?
రిక్త మనగ నొండు యుక్తమౌ పలుకేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 594
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వసతి)
[29/03, 9:06 pm] Laxmaiah: *వరుకోలు లక్ష్మయ్య*
*శీర్షిక:కరోనా కతం*
*తేది:29-03-2020*
*సీసపద్యం*
*ఎల్ల లోకములెల్ల నేలెడి శక్తివే*
*యెందుకు మా పైన యింత పగయు*
*భూ జనులందరు భూరిగా నిన్నిక*
*కొలువలేదా యింత కోపమేల!*
*నిత్య పూజలుజేసి సత్యమై కొలువంగ*
*బుగులు బుట్టేనమ్మ దిగులు దీర్చు*
*పిల్ల జెల్లలు తల్లి ప్రేమతో మిమ్ముల*
*కొలుచు చున్నామమ్మ యలుపు లేక*
*తే.గీ.*
*మాయలాడి కరోనను మడియజేయ*
*గూల్చవేతల్లి నీకెంత గొప్పదిదియు*
*దుర్గ మాయమ్మ శివశక్తి భర్గురాణి*
*బాధలను దొల్గ జేయుమీ ప్రజలకిపుడు.*
[30/03, 7:29 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. ప్రియక వృక్ష మనుచు పేరు జెప్పగనేది..?
అతివ నేమనందు రరుదు గాను..?
పెళ్ళి పిల్ల కేది ప్రేమంపు నొక పేరు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 595
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వట్టి)
[30/03, 8:52 am] Laxmaiah: కందిలిచీకటి బాపుచు
నందముగా వెల్గెనాడు నవని జనులకు
న్నెందున దాగెనొకానీ
తొందరగామళ్ళివచ్చి తోడుగనుండున్
[30/03, 3:03 pm] Laxmaiah: మానవుడా మమ్ము రక్షించు
సీసం.
గజరాజు మొరవిని- ఘనుడైనమకరిని
కడతేర్చవచ్చావు-
మడుగునందు
గోపాలకులమొర- గోకులంబునవిని
గోవర్ధనాద్రిని-గొప్పగెత్తి
నరకాసురినిజంప-నాతిగా సత్యకు
సాయమందించిన-సకల జ్ఞాని
భక్త ప్రహ్లాదుండు-భక్తితోవేడంగ
స్తంభమందునబుట్టి తండ్రిజంపి
గీ.
మనుజు లందర్ని కాపాడె- మాధవుండ
మామొరాలకించనురావ-మాన్యవర్య
జగతి నందు కరోనాయె-
జైత్రయాత్ర
చేయుచుండెను దునుమాడు -శీఘ్రగతిన
[31/03, 7:08 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. వసుధ నేది యొప్పు బంధుత్వ గతిదెల్ప..?
పంక్తి కేది మారు పలుక బూన..?
శ్రేణి కొండు నేది శ్రేష్ఠమై వెలుగొందు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 596
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వధువు)
[31/03, 5:32 pm] Laxmaiah: *మత్త కోకిల*
*తోట కెళ్ళియు పచ్చిమిర్చినితూచి బస్తల తెచ్చికన్*
*రోటి యందున వేసి దానిని రోకలెత్తియు దంచగన్*
*కాటి కోలెనుమెత్త గాయెను కల్పియన్నము తింటికన్*
*నేటికాలమునిట్టితొక్కులు నెక్కడైనను దొర్కునా!!*
*వరుకోలు లక్ష్మయ్య సిద్దిపేట*
[01/04, 6:27 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. దేశమునకు నేది తేల్చి చెప్పగ బూన..?
వాన కెట్టి దొండు వరలు చుండు..?
ఏడు కేది భువిని యెంచిచూపగ వచ్చు
మూట నొక్క మాట ముద్దు బాల..! 597
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వరుస)
[01/04, 1:15 pm] Narsimhareddypavani: లాక్ డౌన్ ని ధిక్కరించి బయటకురండి.
70 వేలమందికి ఈ వ్యాధిని అంటించగలిగితే భారత్ నాశనమౌతుంది.మన స్వాధీనంలోనికి వస్తుంది
-ఇది తబ్లీకీ జమాత్ చీఫ్ మౌలానా...దర్గా సమావేశంలో చెప్పింది.రికార్డెడ్ టేప్ బయట పెట్టిన రిపబ్లిక్ TV......
[02/04, 6:32 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
కవి పండిత సన్మిత్రులెల్లరికి శ్రీ రామ నవమి
శుభాకాంక్షలతో శుభోదయం
గీ. అసురులను ద్రుంచ శ్రీరాము డవతరించి
లోక కల్యాణ మొనరించె ప్రాకటముగ
సీత కల్యాణ వైభోగ గీతికలతో
నవ వసంతము శ్రీ రామ నవమి రోజు...
........ పొడుపు పద్యము ........
ఆ. తరచి చెప్ప బూన ధనపతి దిక్కేది..?
జాబు కెట్టి పేరు జగతి నొప్పు..?
ప్రశ్నలకు జవాబు పలుక బూనఁగ నేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 598
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వర్షము)
[02/04, 10:14 pm] Narsimhareddypavani: అంబ నవాంబుజోజ్జ్వల కరాంబుజ శారదచంద్రచంద్రికా
డంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్న రోచిరా
చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్తివివిక్త నిజ ప్రభావ భా
వాంబరవీథివిశ్రుతవిహారిణి నన్ దయజూడు భారతీ
[03/04, 7:09 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. ఉర్వి నెయ్యది యుపయోగించ నననేది..?
వీథి యనగ నేది విశ్వమందు..?
ఇళ్ళ వరుస కేది యింపైన నొకపేరు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 599
జవాబు … ?
(నిన్నటి జవాబు .. ఉత్తరము)
[04/04, 6:17 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. నాగలి మొన కేది నయమైన నొకపేరు..?
ఎండు ననగ నేది యింపు గొలుప..?
నర శరీర మందు నరివర్గ మది యెంత..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 600
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వాడ)
[05/04, 6:14 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ప్రియము మీర జేయు నయమైన ఋతువేది..?
చెలువ మీరు పిలుపు చెలియ కేది..?
రంగు మీర సాగు రాగమేదై యొప్పు ..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 601
జవాబు … ?
(నిన్నటి జవాబు .. ఆరు)
[06/04, 6:44 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. చెట్టు మూలమునకు చెలువైన పలుకేది..?
అన్య మనగ నేది యరసి చూడ..?
విడిగ నున్న మారు పేరేది యోచించ..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 602
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వసంత)
[07/04, 6:23 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. జనులలోన గల్గు స్వాధీన మననేది..?
బల మటన్న మారు పలుక నేది..?
పర మనియెడు మాట పలుకుచో నెయ్యది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 603
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వేరు)
[08/04, 7:24 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. వదరు ననగ నేది వసుధా స్థలిలోన..?
పారు చిన్నయేరు పలుక నేది..?
ప్రేలు కొండు పేరు పిలువ బూనఁగ నేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 604
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వశము)
[09/04, 7:40 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. భాగమునకు నొండు వరుసైన పదమేది
పాలు కొరకు మారు పలుక నేది
వంతు కెద్ది యొప్పు వాసి గొల్పెడు రీతి
మూట నొక్క మాట ముద్దు బాల..! 605
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వాగు)
[10/04, 6:26 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. చేతి తొడుగు కెట్టి చెలువంపు పేరొప్పు..?
గుండ్ర నైనదేది గురుతు దెలుప..?
ఒప్పు నట్టి పేరు ఒడ్డాణమున కేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 606
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వాటా, వాట)
[10/04, 10:01 pm] Laxmaiah: పద్య భాషణం జేసిన పద్యాలు
1ఆ.వె.
మాస్కు పెట్టకుండ మనుజులు బయటకు
కాలు కదప రాదు వీలు లేక
బయట కెళ్ళినంత భారమౌ బ్రతుకంత
భవిత గనుచు మనము బతుకు వలయు
2గీ
స్వచ్ఛ భారతు సాగాలి స్వేచ్ఛగాను
నిశ్చయంబుగజేయుడి నిష్టతోడ
కలిసి సాగాలి ముందుకు నలుపు లేక
మోడి కోరిన దేశము మోదమలరు
3ఆ.వె.
సంత కెళ్ళి త్వరగ సరుకులెన్నోదెచ్చి
ఇంటి నీయవలెను యింపుగాను
వండిపెట్టి నంక వడ్డన జేసిన
కలిసి తినగవలెను కాంక్ష దీర
4తే.గీ
న్యూసు పేపరు తగ్గెనె నుర్వి యందు
జనులు కొనలేక ప్రింటింగు జరగలేదు
వార్త విషయాలు తెలియవు వసుధ యందు
ఆదరించాలి అందరూ మోదమలర
5ఆ.వె
తెలుగు తెలుసు కున్న తెలివిట పెరుగును
తెలిసి మసలు కొమ్ము విలువనెరిగి
తెలివి కలిగి ఉంటె తెల్లబో మెపుడును
తెలుగువెలుగునింపు తేజమలర
6 తే.గీ
బడులు తెరిచేది నెన్నడో బాలురకును
బయట పనులేమొ దొరకక బాధపడిరి
ఈకరోన జబ్బు వలన నేమిజేతు
విశ్వవ్యాప్తమై యీ జబ్బు వింత గొలిపె
7.తే.గీ
పారిశుద్ధ్య కార్మికులేను ప్రజల కొరకు
అండగా నుండి పనులను నిండజేసి
ప్రాణ భయమును వీడియు పనులు చేయు
వారి కందగ జేతును వందనములు
[11/04, 6:22 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. తోట కొండు గలుగు తోరంపు పేరేమి..?
వీథి కేద్ది మారు వివరముగను..?
తెరువు కొక్క మాట తెలుప బూనఁగ నేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 607
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వలయము)
[11/04, 9:50 pm] Laxmaiah: ఛందోభాషణంలోని పద్యాలు
1ఆ.వె
పిన్నపెద్ద లంత ప్రేమతో మసలిన
సంతసమ్ము గలుగు సదన మందు
కార్య భార మంత కరతలా మలకమై
ఇళ్ళ యందుహాయి వెళ్లి విరియు
2ఆ.వె
బస్సులాగి పోతె భారంబు మనకేను
పనులు జరుగవెపుడు పరగ మనకు
నష్ట మయ్యి జనులు కష్టాల పాలైరి
రక్ష జేయరమ్ము రాజవదన
3ఆ.వె
అమ్మమాటతోడ కమ్మని భాషను
నేర్వ వలెను మొదట నేర్పుతోడ
తెలిసి నన్ని మార్లు తెలివిగా నేర్చిన
జయము కలుగు మనకు జగము నందు
4ఆ.వె
గాలి మోటరెక్కి గగనమ్ము లోకెళ్ళ
వింత లెన్నొ కలుగు పంతముగను
దేశ దేశములను తిరుగాడి చూసిన
జ్ఞానమున్ బెరగియు జయము గలుగు
5
వాణి పాదములను భక్తి గొల్చిన చాలు
చదువుసంధ్యలందు జయము గల్గు
నిండు జ్ఞానమొసగి నిరతమ్ము బ్రోచును
కాని నిపుడు వెళ్ల కష్టమగును
6ఆ.వె.
కోట్లు నష్టపరిచె కోవిడు ధరపైన
చెప్పతరమ గుట్టు విప్ప తరమ
ఈ కరోన వల్ల నిడుములే మిగిలెరా
పూడ్చ కష్ట తరము పుడమి నందు
7ఆ.వె.
కవుల కలమునుండి కవితలే జారగా
పారి పోవు వ్యాధి పద్ధతిగను
కవులు గాయకులును కలిసికట్టుగనుండ
తరుము గలరు దీని ధరణి నుండి
8ఆ.వె
కోప మసలువద్దు నోపికనే ముద్దు
సహనశీలి వయ్యి సాగవలయు
శాంత గుణమె మనల సతతమ్ము రక్షించు
వినుడు ధన్యులార వీను లలర
9 పోకిరోళ్ళనచట పోలీసులే గొట్ట
పారిపోవుచుండ్రి పరుగుదీసి
యింటిలోనె యున్న నిహలోక స్వర్గమ్ము
కాలు బయటబెట్ట కలుగు కీడు
[12/04, 6:22 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. చదువు లమ్మ కేది చక్క నైన పిలుపు ..?
పలుకు కేమి టొప్పు తెలుప బూన..?
ప్రభు వనంగ వేరు రాజిల్లు పదమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 608
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వాటిక)
[13/04, 7:21 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. తలచి చెప్ప బూన 'దావా' యనగ నేది..?
కలహ మనగ నేది తెలియ జెప్ప..?
తర్కమునకు నేది తనరారు నొక పేరు..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 609
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వాణి)
[14/04, 6:57 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. వరల నెవరు బుట్టె బాణాసురున కిల..?
ఉదయ కాల మనగ నొప్పు నేది..?
గోవు కేది మారు కొమరారు నొక పేరు .?
మూట నొక్క మాట ముద్దు బాల..! 610
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వాదు)
[15/04, 6:33 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. బరిగ దెబ్బ తోడ బడు నేది యొంటిపై..?
జీత మందు పెట్టు కోత యేది..?
ఇనుము గాచి పశువు కేది వెట్టుదు రిలను..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 611
జవాబు … ?
(నిన్నటి జవాబు .. ఉష )
[16/04, 6:15 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఒంటి జలుబు కొరకు నింట బుక్కున దేది..?
గడ్డి కుప్ప కేది గలుగు పేరు..?
కడగి కుండ లెల్ల కాల్చెడు స్థలమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 612
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వాత)
[17/04, 6:27 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
అవనిలో సమూహ మన నేది యొప్పారు..?
ఏడు నాళ్ళు కలుప నేమిటండ్రు..?
తడవ యనగ మారు తలపోయు పదమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 613
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వాము)

[18/04, 6:26 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. ఈయ డనెడుదాని నెటుల చెప్పగ వచ్చు..?
ప్రాయ మనగ నేది పలుక బూన..?
ఇల సమాన మన్న నిరవైన పలుకేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 614
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వారము)
[19/04, 7:27 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. కడగి చెప్పగా నఖక్షతమన నేది..?
బాణ మనగ నేది భవ్యముగను..?
విక్రయించు మనిన వేఱొక్క పదమేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 615
జవాబు … ?
(నిన్నటి జవాబు .. ఈడు)
[20/04, 7:36 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. పక్కి గుంపు చెట్లపై నెట్లు కూర్చుండు..?
ఒరిగి యున్నదనిన నొప్పు నేది..?
జోకతోడ నెవరు సుగ్రీవునకు భ్రాత..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 616
జవాబు … ?
(నిన్నటి జవాబు .. అమ్ము)
[21/04, 6:11 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. మొక్క జాతి నెంచ నిక్కంపు పలుకేది..?
వంశమునకు వేరు వరలు నేది..?
నడుము వంచి యుంట నుడువ బూనున దేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 617
జ వాబు … ?
(నిన్నటి జవాబు .. వాలి)
https://youtu.be/55Yt6EQFPWY
[22/04, 6:21 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. ఉన్ని నేమి జేయు యువిద నూలును దీయ..?
చలికి పులికి నరుడు చాటునేది..?
ఉర్వి యందు నేది ఉత్తర దిక్కన..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 618
జవాబు … ?
[23/04, 6:31 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
కత్తి కేది యొండు కలిగి యుండిన పేరు..?
తోచగల్గు నేది తోక యనగ..?
బెబ్బులి యన మారు పలుకేది పరికింప..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 619
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వడకు)
(మొన్నటి జవాబు .. వంగడం
[24/04, 6:13 am] Narsimhareddypavani: ........ తెలుగు సాహితీ పీఠము ........
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
........ పొడుపు పద్యము ........
ఆ. ఇంటి కప్పు కేది నిరవైన నొక కఱ్ఱ ..?
చాప కొండు పేరు చాట నేది..?
ఇల్లు యనగ మారు యింపారు పేరేది..?
మూట నొక్క మాట ముద్దు బాల..! 620
జవాబు … ?
(నిన్నటి జవాబు .. వాలము)
Comments
Post a Comment